
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సోమవారం పెట్రోల్, డీజిల్ ధరలలో ఎటువంటి సవరణను చేయకపోయావడంతో ఇండియాలో ఇంధన ధరలు వరుసగా 142 రోజులు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఓఎంసిలలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) ఉన్నాయి.
ఆర్థిక మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ మే 21న పెట్రోల్‌పై రూ.8, డీజిల్ పై రూ.6 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతో అప్పటి నుండి ఇంధన ధరల్లో మార్పు లేదు.
పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.96.72 ఉండగా, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. మరోవైపు నోయిడాలో పెట్రోల్ ధర లీటరుకు రూ.96.79 ఉండగా, డీజిల్ లీటరుకు రూ.89.96గా ఉంది. గురుగ్రామ్‌లో లీటరు పెట్రోల్ ధర రూ. 97.18 కాగా, డీజిల్ ధర లీటరుకు రూ. 90.05గా ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.96.58, డీజిల్ ధర రూ.89.75గా ఉంది.
ఇతర మెట్రో నగరాల్లో తాజా పెట్రోల్, డీజిల్ ధరలు
ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31గా, డీజిల్ ధర రూ.94.27గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 106.03 లీటర్, డీజిల్ ధర రూ. 92.76. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63గా, డీజిల్ ధర రూ.94.24గా ఉంది.
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( BPCL ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) సహా ప్రభుత్వ రంగ ఓఎంసిలు అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలు, విదేశీ మారకపు ధరలకు అనుగుణంగా ఇంధన ధరలను ప్రతిరోజూ సవరిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలలో ఏవైనా మార్పులు ఉంటే ప్రతి రోజు ఉదయం 6 గంటల నుండి అమలు చేయబడతాయి. VAT లేదా సరుకు రవాణా ఛార్జీల వంటి స్థానిక పన్నుల కారణంగా రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాల నుండి రాష్ట్రాలకు మారుతూ ఉంటాయి.