ఈ సంవత్సరం చివరి రోజున ఇంధన ధరలు పెరిగాయా.. ? నేడు లీటరు పెట్రోల్, డీజిల్ ధర ఎంతంటే..?

By asianet news teluguFirst Published Dec 31, 2022, 9:11 AM IST
Highlights

నేడు గ్లోబల్ మార్కెట్‌లో ఈరోజు క్రూడాయిల్ ధరలు ఎగిశాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు $ 2.45 (2.49 శాతం) పెరిగి $ 85.91 వద్ద ట్రేడవుతోంది. WTI బ్యారెల్‌కు $ 80.26డాలర్లుకు చేరుకుంది.

నేడు ఈ సంవత్సరం చివరి రోజున అంటే డిసెంబర్ 31 శనివారం ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దాదాపు ఏడు నెలలుగా భారత్‌లో పెట్రోలు-డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27గా ఉంది. ఈ ఏడాది మే 21న దేశవ్యాప్తంగా ఇంధన ధరలలో చివరి మార్పు జరిగింది, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్‌పై లీటరుకు రూ. 8, డీజిల్‌పై రూ. 6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన సంగతి మీకు తెలిసిందే. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24 కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.03, డీజిల్ ధర రూ.92.76

బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.101.94, డీజిల్ ధర రూ.87.89.
లక్నోలో  లీటర్ పెట్రోల్ ధర రూ. 96.57, డీజిల్ ధర రూ. 89.76 
నోయిడాలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.79, డీజిల్ ధర రూ.89.96

గురుగ్రామ్ లో లీటర్ పెట్రోల్ ధర రూ 97.18, డీజిల్ ధర రూ 90.05 
చండీగఢ్లో  లీటర్ పెట్రోల్ ధర రూ.96.20, డీజిల్ ధర రూ.84.26 
హైదరాబాద్లో  లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82.

గ్లోబల్ మార్కెట్‌లో ఈరోజు క్రూడాయిల్ ధరలు ఎగిశాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు $ 2.45 (2.49 శాతం) పెరిగి $ 85.91 వద్ద ట్రేడవుతోంది. WTI బ్యారెల్‌కు $ 80.26డాలర్లుకు చేరుకుంది.

మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలను మెసేజ్ ద్వారా  కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కస్టమర్లు మీరు RSP అని టైప్ చేసి మీ సిటీ కోడ్‌ని ఎంటర్ చేసి 9224992249 నంబర్‌కు మెసేజ్ పంపాలి. ప్రతిరోజు కొత్త ధరలు ఉదయం 6 గంటల నుంచి వర్తిస్తాయి పెట్రోలు. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్), సరకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నుల కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) సహా ప్రభుత్వ రంగ OMCలు అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలు, విదేశీ మారకపు ధరల ఆధారంగా ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తుంటాయి.

click me!