నేడు పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు విడుదల.. మీ నగరంలో ఒక లీటరు ధర ఎంతో తెలుసుకోండి..

By asianet news teluguFirst Published May 1, 2023, 11:28 AM IST
Highlights

ఈ రోజు ఢిల్లీలో ఒక లీటర్ పెట్రోల్ ధర రూ. 96.72, డీజిల్‌ ధర రూ. 89.62గా ఉంది. అదేవిధంగా, ముంబైలో లీటర్ పెట్రోల్‌ ధర  రూ.106.31, డీజిల్‌ ధర రూ.94.72.

నేడు  మే 1 కార్మికుల దినోత్సవం, అలాగే సోమవారం నాడు దేశంలోని ప్రముఖ మెట్రో నగరాల్లో ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఇంధన ధరలు తగ్గుముఖం పట్టాయి. మహారాష్ట్రలో పెట్రోల్ పై 41 పైసలు, డీజిల్ 39 పైసలు తగ్గింది. పంజాబ్‌లో కూడా పెట్రోల్ 26 పైసలు, డీజిల్ 25 పైసలు, ఉత్తరప్రదేశ్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధర 25 పైసలు, పశ్చిమ బెంగాల్‌లో పెట్రోల్‌పై 44 పైసలు, డీజిల్‌పై 41 పైసలు తగ్గాయి.

మరోవైపు చాలా నగరాల్లో పెట్రోల్ లీటరు ధర రూ.100 మార్కును దాటాయి. ఈ రోజు ఢిల్లీలో ఒక లీటర్ పెట్రోల్ ధర రూ. 96.72, డీజిల్‌ ధర రూ. 89.62గా ఉంది. అదేవిధంగా, ముంబైలో లీటర్ పెట్రోల్‌ ధర  రూ.106.31, డీజిల్‌ ధర రూ.94.72.

ఈ నగరాల్లోనూ కొత్త ధరలు 

– నోయిడాలో పెట్రోల్ ధర రూ.96.58కి, డీజిల్ ధర లీటరుకు రూ.89.75.

– ఘజియాబాద్‌లో పెట్రోల్ ధర రూ.96.58, లీటర్ డీజిల్‌ ధర  రూ.89.75.

– లక్నోలో లీటరు పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.76గా ఉంది.

– పాట్నాలో లీటరు పెట్రోల్ ధర రూ.107.42, డీజిల్ ధర రూ.94.04గా ఉంది.

– పోర్ట్ బ్లెయిర్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.84.10, డీజిల్ ధర రూ.79.74గా ఉంది.

–హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ. 109.66, డీజిల్ ధర రూ. 97.82

ATF అని పిలువబడే జెట్ ఇంధనం ధర దేశ రాజధానిలో రూ.98,349.95/kL నుండి రూ. 95,935.34/kLకి తగ్గింది. ఈ ధరల తగ్గింపు విమానయాన పరిశ్రమకు పెద్ద ఉపశమనం లాంటిది.అంతకుముందు మార్చి 1న, ATF ధర 4% తగ్గించబడింది

భారతదేశంలో ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) ప్రతిరోజు పెట్రోల్ డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముడి చమురు ధరకు అనుగుణంగా రేట్లు నిర్ణయించబడతాయి.

ఇంధన ధరలు ఎందుకు మారుతున్నాయి?
ప్రతి రోజు ఇంధన ధరలు ఉదయం 6 గంటలకు ప్రకటించబడతాయి. అయితే ఇవి రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి. వాల్యూ ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన ప్రమాణాల కారణంగా ఉంటుంది.

click me!