పెట్రోల్ డీజిల్ ధరల అప్‌డేట్: పెట్రోల్ బంక్ కి వెళ్ళే ముందు నేటి ధరలు తెలుసుకొండి..

By asianet news teluguFirst Published Dec 10, 2022, 9:16 AM IST
Highlights

 మరోవైపు గ్లోబల్ మార్కెట్‌లో ఈరోజు క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. నేడు WTI క్రూడ్ ధర బ్యారెల్‌కు $78కి, బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు $85కి పడిపోయింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్  ధరల తగ్గుదల మధ్య  భారతీయ ఆయిల్ కంపెనీలు నేడు అంటే డిసెంబర్ 10న  పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా కొనసాగించాయి.

 మరోవైపు గ్లోబల్ మార్కెట్‌లో ఈరోజు క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. నేడు WTI క్రూడ్ ధర బ్యారెల్‌కు $78కి, బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు $85కి పడిపోయింది.

అంతకుముందు మే 21న కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన సంగతి తెలిసిందే. దీంతో లీటర్ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున దిగోచ్చింది. అప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. కేంద్రం ప్రకటన తర్వాత రాజస్థాన్, మహారాష్ట్ర, ఒడిశా, కేరళ ప్రభుత్వాలు కూడా పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ని తగ్గించాయి.

ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27కు లభిస్తోంది. కోల్‌కతాలో పెట్రోలు ధర రూ.106.03, డీజిల్ ధర  లీటరుకు రూ.92.76గా ఉంది. మరోవైపు చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24గా ఉంది.

నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ?

ఢిల్లీ: లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62.

ముంబై: లీటర్ పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27.

కోల్‌కతా: లీటర్ పెట్రోల్ ధర రూ.106.03, డీజిల్ ధర రూ.92.76.

చెన్నై: లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24.

హైదరాబాద్: లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82.

బెంగళూరు: లీటర్ పెట్రోల్ ధర రూ.101.94, డీజిల్ ధర రూ.87.89.

తిరువనంతపురం: లీటర్ పెట్రోల్ ధర రూ.107.71, డీజిల్ ధర రూ.96.52.

పోర్ట్ బ్లెయిర్: లీటర్ పెట్రోల్ ధర రూ. 84.10, డీజిల్ ధర రూ.79.74.

భువనేశ్వర్: లీటర్ పెట్రోల్ ధర రూ.103.19, డీజిల్ ధర రూ.94.76.

చండీగఢ్: లీటర్ పెట్రోల్ ధర రూ.96.20, డీజిల్ ధర రూ.84.26.

లక్నో: లీటర్ పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.76.

నోయిడా: లీటర్ పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.96.

జైపూర్: లీటర్ పెట్రోల్ ధర రూ.108.48, డీజిల్ ధర రూ.93.72.

పాట్నా: లీటర్ పెట్రోల్ ధర రూ.107.24, డీజిల్ ధర రూ.94.04

ఎక్సైజ్‌ డ్యూటీ, డీలర్‌ కమీషన్‌, ఇతర చార్జీలు కలిపితే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అసలు ధర కంటే  దాదాపు రెట్టింపు అవుతాయి. విదేశీ మారకపు ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ఆధారంగా పెట్రోల్, డీజిల్ ధరలను  ప్రతిరోజూ సమీక్షిస్తుంటారు.

click me!