పెట్రోల్-డీజిల్ ధరల అప్‌డేట్.. ఢిల్లీ -హైదరాబాద్ సహా కొత్త ధరలు ఇవే..

By asianet news teluguFirst Published Oct 21, 2022, 8:35 AM IST
Highlights

శుక్రవారం ఉదయం డబ్ల్యూటీఐ క్రూడ్ బ్యారెల్ ధర 85.98 డాలర్లకు, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 92.44 డాలర్లకు పెరిగింది. చమురు కంపెనీలు జారీ చేసిన ధర ప్రకారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.72, డీజిల్ రూ.89.62గా ఉంది.

న్యూఢిల్లీ: ఇంధన కంపెనీలు ఈరోజు అంటే అక్టోబర్ 21న పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి . ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా వంటి మెట్రో నగరాల్లో ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు. మే 22న కేంద్ర ప్రభుత్వం ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన సంగతి మీకు తెలిసిందే. దీంతో  పెట్రోల్ ధర రూ.8, డీజిల్ రూ.6 తగ్గింది. అప్పటి నుంచి వాటి ధరలు పెరగలేదు.

చమురు కంపెనీలు జారీ చేసిన ధర ప్రకారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.72, డీజిల్ రూ.89.62గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.106.31, డీజిల్ రూ.97.28, చెన్నైలో పెట్రోల్  ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24, కోల్‌కతాలో పెట్రోల్  ధర రూ.106.03,  డీజిల్ ధర రూ.92.76గా ఉంది.  హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ. 109.66, డీజిల్ ధర రూ. 97.82.

శుక్రవారం ఉదయం డబ్ల్యూటీఐ క్రూడ్ బ్యారెల్ ధర 85.98 డాలర్లకు, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 92.44 డాలర్లకు పెరిగింది. 

దేశీయంగా ఇంధన చమురు ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలను చమురు కంపెనీలు ప్రతిరోజూ సమీక్షిస్తాయి, దీని ఆధారంగా కొత్త ధరలను ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు విడుదల చేస్తారు.  మీరు ఇంట్లో కూర్చొని మీ నగరంలో  ఇంధన ధరలను తెలుసుకోవడానికి, మీరు ఇండియన్ ఆయిల్ మెసేజ్ సర్వీస్ కింద మొబైల్ నంబర్ 9224992249కి SMS పంపాలి.  

click me!