todays fuel prices:చమురు ధరలపై ఉపశమనం.. ఇక్కడ పెట్రోల్ లీటరు రూ. 84కే లభిస్తోంది..

By asianet news teluguFirst Published Aug 11, 2022, 10:12 AM IST
Highlights

IOCL లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం, ఇండియాలో పెట్రోల్, డీజిల్ అతితక్కువకు పోర్ట్ బ్లెయిర్‌లో అమ్ముడవుతోంది. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.84.10గా ఉండగా, డీజిల్ ధర రూ.79.74గా ఉంది. 

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలో మార్పుల మధ్య గురువారం పెట్రోల్-డీజిల్ తాజా ధరలు విడుదలయ్యాయి. నేడు చమురు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దీంతో పెట్రోల్, డీజిల్ కొనుగోలుదారులకు ఊరట లభించింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోలు ధర రూ.96.72గా, డీజిల్ ధర లీటరుకు రూ.89.62గా కొనసాగుతోంది.

IOCL లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం, ఇండియాలో పెట్రోల్, డీజిల్ అతితక్కువకు పోర్ట్ బ్లెయిర్‌లో అమ్ముడవుతోంది. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.84.10గా ఉండగా, డీజిల్ ధర రూ.79.74గా ఉంది. మరోవైపు  ఇతర నగరాలలో చమురు ధరలు మారలేదు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోలు రూ.106.31గా, డీజిల్ ధర రూ.94.27 వద్ద కొనసాగుతోంది. కోల్‌కతా గురించి చెప్పాలంటే, ఇక్కడ ఒక లీటర్ పెట్రోల్ ధర రూ. 106.03 కాగా, డీజిల్ ధర రూ. 92.76గా ఉంది. చెన్నైలో పెట్రోలు ధర రూ.102.63 కాగా, డీజిల్ ధర రూ.94.24గా ఉంది. హైదరాబాద్ పెట్రోల్ ధర  రూ. 109.66, డీజిల్ ధర రూ. 97.82

ప్రతిరోజూ పెట్రోల్-డీజిల్ ధరల అప్ డేట్ 
 అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ఆధారంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇంధన ధరలను సమీక్షించిన తర్వాత ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం ఆయిల్ కంపెనీలు ప్రతిరోజూ ఉదయం వివిధ నగరాల పెట్రోల్, డీజిల్ ధరల సమాచారాన్ని అప్‌డేట్ చేస్తాయి.

రాష్ట్ర స్థాయిలో పెట్రోల్‌పై విధించే పన్ను కారణంగా వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా వేర్వేరుగా ఉంటాయి. మీరు మీ ఫోన్ నుండి SMS ద్వారా ప్రతిరోజూ భారతదేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలను తెలుసుకోవచ్చు. దీని కోసం ఇండియన్ ఆయిల్ (IOCL) వినియోగదారులు RSP కోడ్‌ను టైప్ చేసి 9224992249 నంబర్‌కు పంపాలి.

చమురు కంపెనీలకు భారీ నష్టాలు
ఒక నివేదిక ప్రకారం జూన్ త్రైమాసికంలో IOC 1992 కోట్ల నష్టాన్ని, బీపీసీఎల్ జూన్ త్రైమాసికంలో 6,290.80 కోట్ల నష్టాన్ని, జూన్‌ త్రైమాసికంలో హెచ్‌పీసీఎల్‌ 10,197 కోట్ల నష్టాన్ని చవిచూసింది.

click me!