పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు విడుదల.. నేడు లీటరు ధర ఎంతో చెక్ చేసుకోండీ..

By asianet news teluguFirst Published Aug 30, 2022, 9:59 AM IST
Highlights

దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.35 నుండి ఈరోజు రూ. 106.31 కాగా, డీజిల్ ధర రూ. 94.27, క్రితం ధర లీటరుకు రూ. 97.28 నుండి తగ్గింది. 

నేడు 30 ఆగస్టు 2022 మంగళవారం రోజున పెట్రోల్,  డీజిల్  స్థిరంగా ఉన్నాయి. గత మూడు నెలలకు పైగా  వీటి ధరలలో ఎలాంటి మార్పు లేదు. 21 మే 2022న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్‌పై లీటరుకు రూ. 8, డీజిల్‌పై రూ. 6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించిన సంగతి మీకు తెలిసిందే. ఎక్సైజ్ సుంకం తగ్గింపునకు ముందు ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.105.41 ఉండగా ప్రస్తుతం రూ.96.72గా ఉంది, డీజిల్ ధర రూ.96.67గా నుండి రూ.89.62గా చేరింది. మహారాష్ట్ర ప్రభుత్వం గత నెల ప్రారంభంలో పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 చొప్పున విలువ ఆధారిత పన్ను (వ్యాట్) తగ్గింపును ప్రకటించింది. వ్యాట్‌లో కోత వల్ల మహారాష్ట్ర రాష్ట్ర ఖజానాకు వార్షిక ప్రాతిపదికన రూ.6,000 కోట్లు నష్టం వాటిల్లనుంది.

ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.35 నుండి ఈరోజు రూ. 106.31 కాగా, డీజిల్ ధర రూ. 94.27, క్రితం ధర లీటరుకు రూ. 97.28 నుండి తగ్గింది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) సహా ప్రభుత్వ రంగ OMCలు అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలు ఇంకా విదేశీ మారకపు ధరలకు అనుగుణంగా ఇంధన ధరలను ప్రతిరోజూ సవరిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలలో ఏవైనా మార్పులు ఉంటే ప్రతి రోజు ఉదయం 6 గంటల నుండి అమల్లోకి వస్తాయి. VAT లేదా సరుకు రవాణా ఛార్జీల వంటి స్థానిక పన్నుల కారణంగా రిటైల్ పెట్రోల్ అండ్ డీజిల్ ధరలు రాష్ట్రాల నుండి రాష్ట్రాలకు మారుతూ ఉంటాయి.

ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 106.31, డీజిల్ ధర లీటరుకు 94.27

ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ. 96.72, డీజిల్ ధర రూ. 89.62

చెన్నైలో పెట్రోలు ధర లీటరుకు రూ. 102.63, డీజిల్ ధర రూ. 94.24

కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 106.03, డీజిల్ ధర రూ. 92.76

బెంగళూరులో పెట్రోలు లీటరుకు రూ. 101.94, డీజిల్ ధర లీటరుకు రూ. 87.89

లక్నోలో  పెట్రోలు లీటరుకు రూ. 96.57, డీజిల్ ధర రూ. 89.76

నోయిడాలో పెట్రోల్ ధర రూ. 96.79, డీజిల్ ధర  రూ. 89.96

గురుగ్రామ్ లో  పెట్రోల్ ధర రూ. 97.18, డీజిల్ ధర రూ. 90.05

చండీగఢ్ లో పెట్రోల్ ధర రూ. 96.20, డీజిల్ ధర రూ. 84.26

హైదరాబాద్‌లో పెట్రోల్ ధర  రూ. 109.66, డీజిల్ ధర   లీటరుకు రూ. 97.82

click me!