నేడు పెట్రోల్-డీజిల్ ధర: క్రూడాయిల్ ధర పతనం, లీటరు ధర ఎంతంటే..?

By asianet news teluguFirst Published Sep 28, 2022, 9:33 AM IST
Highlights

 భారత చమురు కంపెనీలు వాహన ఇంధనం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ముడి చమురు ధర బ్యారెల్‌కు 80 డాలర్ల కంటే తక్కువగా వస్తే ఇండియాలో పెట్రోల్ - డీజిల్ చౌకగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. 

క్రూడాయిల్ ధరలో తగ్గుదల కొనసాగుతోంది. సోమవారం అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడి చమురు బ్యారెల్‌కు $ 84.06 చేరడంతో  జనవరి నుండి కనిష్ట స్థాయికి చేరుకుంది. మరోవైపు భారత చమురు కంపెనీలు వాహన ఇంధనం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ముడి చమురు ధర బ్యారెల్‌కు 80 డాలర్ల కంటే తక్కువగా వస్తే ఇండియాలో పెట్రోల్ - డీజిల్ చౌకగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. వచ్చే వారం వరకు బ్రెంట్ క్రూడ్ ధర తగ్గడం కొనసాగితే నవరాత్రి సమయంలో పెట్రోల్ -డీజిల్ చౌకగా మారవచ్చు.

ఈరోజు ఢిల్లీ-ముంబైలో పెట్రోల్ ధర ?

ఢిల్లీలో ఈరోజు (బుధవారం) 28 సెప్టెంబర్ న పెట్రోల్ ధర లీటరుకు రూ. 96.72, డీజిల్ ధర లీటరుకు రూ. 89.62, ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24గా ఉంది. అంతేకాకుండా కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.03, డీజిల్ ధర రూ.92.76. హైదరాబాద్‌లో పెట్రోల్ లీటరుకు రూ.109.66, డీజిల్ ధర రూ.97.82

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర హెచ్చుతగ్గుల మధ్య మే 21 నుంచి జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి.  ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైతో సహా ఇండియాలోని అన్ని నగరాల్లో  పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. 

పెట్రోల్-డీజిల్ ధరల అప్ డేట్ 
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ఆధారంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు ధరలను సమీక్షించిన తర్వాత ప్రతిరోజూ పెట్రోల్ - డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీలు ప్రతిరోజూ ఉదయం వివిధ నగరాలలో పెట్రోల్ డీజిల్ ధరలను అప్‌డేట్ చేస్తాయి.  

ప్రముఖ నగరాల్లో పెట్రోల్ -డీజిల్ ధరలు

నగరం      పెట్రోల్        డీజిల్ 
లక్నో           96.57    89.76
పోర్ట్ బ్లెయిర్ 84.10     79.74 
బెంగళూరు    101.94    87.89 
నోయిడా       96.57    89.96
గురుగ్రామ్    97.18    90.05
 

click me!