నేడు పెట్రోల్-డీజిల్ ధరలు ఇవే: రెండు రోజుల్లో నాలుగు డాలర్లు పెరిగిన క్రూడాయిల్..

By asianet news teluguFirst Published Sep 29, 2022, 9:00 AM IST
Highlights

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలో చాలా ఒడిదుడుకులు చోటుచేసుకుంటున్నా సుమారు కొన్ని నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. గతేడాది సెప్టెంబర్ తర్వాత పెట్రోల్ కంటే డీజిల్ మార్కెట్ వేగంగా పెరిగింది. 
 

 ఇండియాలో పెట్రోల్ - డీజిల్ కొత్త ధరలు విడుదలయ్యాయి. ఈరోజు అంటే 29 సెప్టెంబర్ 2022న ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్ - డీజిల్ ధరలను సమీక్షించి విడుదల చేస్తాయి. మీరు కూడా ఈ రోజు పెట్రోల్ - డీజిల్ తాజా ధరలను తెలుసుకోవాలనుకుంటే ఇలా తెలుసుకోవచ్చు. 

గురువారం ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర లీటరుకు రూ.89.62గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ లీటర్ ధర రూ.94.27గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24గా ఉంది.  కోల్‌కతాలో గురువారం లీటరు పెట్రోలు ధర రూ.106.03, డీజిల్ ధర రూ.92.76. హైదరాబాద్‌లో పెట్రోల్ లీటరుకు రూ.109.66, డీజిల్ ధర రూ.97.82

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలో చాలా ఒడిదుడుకులు చోటుచేసుకుంటున్నా సుమారు కొన్ని నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. గతేడాది సెప్టెంబర్ తర్వాత పెట్రోల్ కంటే డీజిల్ మార్కెట్ వేగంగా పెరిగింది. 

ముడి చమురు ధర
సోమవారం ముడి చమురు ధర తొమ్మిది నెలల్లో మొదటిసారిగా బ్యారెల్ $85 దిగువకు పడిపోయింది. అయితే మంగళ, బుధవారాల్లో బ్యారెల్‌కు రెండు డాలర్లు పెరిగింది. అయితే గురువారం ప్రారంభ ట్రేడింగ్‌లో స్వల్ప క్షీణత కనబరుస్తోంది. బ్రెంట్ క్రూడ్ 32 సెంట్లు తగ్గి బ్యారెల్ $89 వద్ద ట్రేడవుతోంది. అదేవిధంగా, యుఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యుటిఐ) ధర కూడా 28 సెంట్లు తగ్గుదలని చూపుతోంది. బ్యారెల్‌కు 81.87 డాలర్లుగా ట్రేడవుతోంది.
 

click me!