వాహనదారులకు రిలీఫ్.. నేడు స్థిరంగా ఇంధన ధరలు.. హైదరాబాద్ లో లీటరు ధర ఎంతంటే..?

By asianet news teluguFirst Published Nov 19, 2022, 8:34 AM IST
Highlights

ఢిల్లీ నోయిడాలో లీటరు పెట్రోల్ ధర రూ.96.79, డీజిల్  ధర రూ.89.96. ఘజియాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.58గా ఉండగా, డీజిల్‌ ధర రూ.89.75గా ఉంది. అంతేకాకుండా గురుగ్రామ్‌లో పెట్రోల్ ధర రూ.97.18, డీజిల్ ధర లీటరుకు రూ.90.05గా ఉంది.

నేడు దేశవ్యాప్తంగా పెట్రోలు-డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు ప్రభుత్వ ఆయిల్ సంస్థలు విడుదల చేసిన డాటా ప్రకారం నవంబర్ 19న పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అన్ని మెట్రో నగరాల నుండి వివిధ రాష్ట్రాలలో ఇంధన ధరలు ఒకే విధంగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర పడిపోపోతున్న  మే 21 నుంచి జాతీయ మార్కెట్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా, లీటర్ డీజిల్ ధర రూ.89.62గా ఉంది. పోర్ట్ బ్లెయిర్‌లో అత్యంత తక్కువ ధరకు పెట్రోల్, డీజిల్ అమ్ముడవుతోంది. ఇక్కడ లీటరు పెట్రోల్ ధర రూ.84.10, డీజిల్ ధర రూ.79.74గా ఉంది.

ఢిల్లీ నోయిడాలో లీటరు పెట్రోల్ ధర రూ.96.79, డీజిల్  ధర రూ.89.96. ఘజియాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.58గా ఉండగా, డీజిల్‌ ధర రూ.89.75గా ఉంది. అంతేకాకుండా గురుగ్రామ్‌లో పెట్రోల్ ధర రూ.97.18, డీజిల్ ధర లీటరుకు రూ.90.05గా ఉంది.

మెట్రో నగరాల గురించి మాట్లాడితే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) అధికారిక వెబ్‌సైట్ iocl.com తాజా అప్‌డేట్ ప్రకారం, చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.63, డీజిల్ ధర లీటరుకు రూ. 94.24 వద్ద స్థిరంగా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.106.03, డీజిల్ ధర లీటరుకు రూ.92.76గా ఉంది. అంతేకాకుండా దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటరు పెట్రోలు ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27గా ఉంది. హైదరాబాద్‌లో పెట్రోలు ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82.

రాజస్థాన్‌లోని ప్రముఖ జిల్లాల్లో పెట్రోల్ ధర
రాజస్థాన్‌లో చాలా కాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకపోవడంతో ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం జైపూర్‌లో 1 లీటర్ పెట్రోల్ ధర రూ.108.48 కాగా, డీజిల్ ధర లీటరుకు రూ.93.72గా ఉంది. అంతేకాకుండా అల్వార్‌లో పెట్రోల్ధర  రూ.109.71, డీజిల్ ధర రూ.94.81గా ఉంది. బికనీర్‌లో పెట్రోల్ ధర రూ.110.72, డీజిల్ ధర లీటరుకు రూ.95.75. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్  ఆధారంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలను సమీక్షించిన తర్వాత ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ కొత్త ధరలను నిర్ణయిస్తాయి.  

మీరు మీ సిటీలో పెట్రోల్, డీజిల్ ధరలను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు. మీరు BPCL కస్టమర్ అయితే పెట్రోల్, డీజిల్ ధరలను చెక్ చేయడానికి RSP <డీలర్ కోడ్>ని 9223112222కు ఎస్‌ఎం‌ఎస్ పంపండి. మీరు ఇండియన్ ఆయిల్ (IOC) కస్టమర్ అయితే, RSP <డీలర్ కోడ్> అని 9224992249కి SMS చేయండి. HPCL కస్టమర్ అయితే,  HPPRICE <డీలర్ కోడ్> అని 9222201122కు SMS చేయండి.

click me!