భగ్గుమంటున్న క్రూడాయిల్.. నేడు మూడు నెలలకు పైగా స్థిరంగా ఇంధన ధరలు..

By asianet news teluguFirst Published Aug 26, 2022, 10:10 AM IST
Highlights

ఎక్సైజ్ సుంకం తగ్గించడానికి ముందు ఢిల్లీలో పెట్రోలు ధర లీటర్ రూ. 105.41 ఉండగా ప్రస్తుతం రూ. 96.72గా ఉంది, డీజిల్ ధర రూ. 96.67 నుండి రూ. 89.62 చేరింది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.35 నుండి రూ. 106.31కి, డీజిల్ ధర రూ. 97.28 నుండి రూ. 94.27 దిగోచ్చింది.
 

నేడు దేశంలోని ప్రముఖ నగరాలు ఢిల్లీ, బెంగుళూరు, చెన్నై, ముంబై, లక్నోలో పెట్రోల్, డీజిల్ ధరలు మారలేదు, దీంతో గత మూడు నెలలకు పైగా ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. మే 21న దేశవ్యాప్తంగా  ధరలలో చివరిసారి మార్పు వచ్చింది,  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్‌పై లీటరుకు రూ. 8, డీజిల్‌పై రూ. 6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. మహారాష్ట్ర ప్రభుత్వం గత నెల ప్రారంభంలో పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 చొప్పున విలువ ఆధారిత పన్ను (వ్యాట్) తగ్గింపును ప్రకటించింది. వ్యాట్‌లో కోత వల్ల మహారాష్ట్ర రాష్ట్ర ఖజానాకు వార్షిక ప్రాతిపదికన రూ.6,000 కోట్లు నష్టం వాటిల్లనుంది. 

ఎక్సైజ్ సుంకం తగ్గించడానికి ముందు ఢిల్లీలో పెట్రోలు ధర లీటర్ రూ. 105.41 ఉండగా ప్రస్తుతం రూ. 96.72గా ఉంది, డీజిల్ ధర రూ. 96.67 నుండి రూ. 89.62 చేరింది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.35 నుండి రూ. 106.31కి, డీజిల్ ధర రూ. 97.28 నుండి రూ. 94.27 దిగోచ్చింది.

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( BPCL ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( HPCL) సహా ప్రభుత్వ రంగ OMCలు అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలు, విదేశీ మారకపు ధరలకు అనుగుణంగా ప్రతిరోజూ ఇంధన ధరలను సవరిస్తాయి. పెట్రోల్ - డీజిల్ ధరలలో ఏవైనా మార్పులు ఉంటే ప్రతి రోజు ఉదయం 6 గంటల నుండి అమలు చేస్తాయి. వ్యాట్ లేదా సరుకు రవాణా ఛార్జీలు వంటి స్థానిక పన్నుల కారణంగా రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాల నుండి రాష్ట్రాలకు మారుతూ ఉంటాయి.

 ముంబై: పెట్రోల్ ధర లీటరుకు రూ. 106.31, డీజిల్ ధర లీటరుకు 94.27

ఢిల్లీలో  పెట్రోలు ధర లీటరుకు రూ. 96.72, డీజిల్ ధర లీటరుకు రూ. 89.62

చెన్నైలో పెట్రోలు ధర లీటరుకు రూ. 102.63, డీజిల్ ధర లీటరుకు రూ. 94.24

కోల్‌కతాలో  పెట్రోలు ధర లీటరుకు రూ. 106.03, డీజిల్ ధర లీటరుకు రూ. 92.76

బెంగళూరులో పెట్రోలు ధర లీటరుకు రూ. 101.94, డీజిల్ ధర లీటరుకు రూ. 87.89

లక్నోలో  పెట్రోలు ధర లీటరుకు రూ. 96.57, డీజిల్ ధర రూ. 89.76

నోయిడాలో పెట్రోల్ ధర రూ. 96.79, డీజిల్ ధర రూ. 89.96

గురుగ్రామ్ పెట్రోల్ ధర రూ. 97.18, డీజిల్ ధర రూ. 90.05

చండీగఢ్ పెట్రోల్ ధర రూ. 96.20, డీజిల్ ధర రూ. 84.26

 హైదరాబాద్‌లో పెట్రోల్ ధర  రూ. 109.66, డీజిల్ ధర   లీటరుకు రూ. 97.82

ముడి చమురు ధర
క్రూడాయిల్ ధరలు శుక్రవారం ఉదయం కూడా పెరుగుతూనే ఉన్నాయి. అయితే బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 46 సెంట్లు పెరిగి బ్యారెల్ $100.02 వద్ద ట్రేడవుతున్నాయి. రాయిటర్స్ ప్రకారం, WTI క్రూడ్ బ్యారెల్ $ 93.00 వద్ద 48 సెంట్లు పెరిగింది. 

click me!