పెట్రోల్, డీజిల్ ధరలు: ఢిల్లీ నుండి హైదరాబాద్ వరకు నేటి ధరలు ఇవే.. మీ నగరంలో లీటరు ఎంతో తెలుసుకోండి ?

By asianet news telugu  |  First Published Jun 6, 2023, 9:45 AM IST

భారతదేశంలో ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు ఇంధన ధరలు సవరించబడతాయి. జూన్ 2017కి ముందు పెట్రోల్ డీజిల్ ధరలలో సవరణ ప్రతి 15 రోజులకు ఉండేది.


న్యూఢిల్లీ: నేడు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. WTI క్రూడాయిల్ బ్యారెల్‌కు $0.21 తగ్గి $ 71.94 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $ 0.17 తగ్గి $ 76.54 వద్ద చేరింది. ఇండియాలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తాజాగా  పెట్రోల్, డీజిల్ కొత్త ధరలను విడుదల చేశాయి. భారతదేశంలో ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు ఇంధన ధరలు సవరించబడతాయి. జూన్ 2017కి ముందు పెట్రోల్ డీజిల్ ధరలలో సవరణ ప్రతి 15 రోజులకు ఉండేది.

 ఈరోజు భువనేశ్వర్‌లో లీటరు పెట్రోల్‌ ధర రూ.103.63గా ఉంది. కాగా, డీజిల్ ధర రూ.95.18. జైపూర్‌లో లీటర్ పెట్రోల్ రూ.108.48, డీజిల్ రూ.93.80గా ఉంది. గురుగ్రామ్‌లో పెట్రోల్ ధరలో ఎలాంటి మార్పు లేదు కానీ డీజిల్ స్వల్ప పెరుగుదలతో లీటరుకు రూ.89.72గా ఉంది.

Latest Videos

నాలుగు మెట్రో నగరాలలో పెట్రోల్-డీజిల్ నేటి ధరలు
- ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 96.72,  డీజిల్ ధర రూ. 89.62
- ముంబైలో పెట్రోల్ ధర రూ. 106.31, డీజిల్ ధర రూ. 94.27 - 
- కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 106.03, డీజిల్ రూ. 92.76, 
-చెన్నైలో   పెట్రోల్ లీటరుకు రూ. 102.65, డీజిల్ ధర లీటరుకు రూ. 94.25

ఈ నగరాల్లో కొత్త ధరలు 
- నోయిడాలో పెట్రోల్ ధర రూ. 96.92, డీజిల్ ధర లీటరుకు రూ. 90.08.
– ఘజియాబాద్‌లో పెట్రోల్ ధర రూ.96.26, లీటర్ డీజిల్‌ ధర  రూ.89.45.
-లక్నోలో లీటరు పెట్రోల్ ధర రూ.96.43, డీజిల్ ధర రూ.89.63గా ఉంది.
– పాట్నాలో లీటరు పెట్రోల్ ధర రూ.107.76, డీజిల్ ధర రూ.94.52.
– పోర్ట్ బ్లెయిర్‌లో లీటరు పెట్రోల్ ధర  రూ.84.10, డీజిల్ ధర రూ.79.74గా ఉంది.

హైదరాబాద్ లో ఈరోజు పెట్రోల్ ధర లీటరుకు రూ. 109.66.  డీజిల్ ధర రూ. 97.82 లీటరుకి.

ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు
ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్,  డీజిల్ ధరలను సమీక్షించి, కొత్త రేట్లు జారీ చేయబడతాయి. పెట్రోల్ డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్ ఇతర  జోడించిన తర్వాత, దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోలు, డీజిల్‌లను మనం ఇంత ఎక్కువకు  కొనుగోలు చేయాల్సి రావడానికి ఇదే కారణం.

ఈ విధంగా  తాజా ధరలను 
మీరు SMS ద్వారా ప్రతిరోజు పెట్రోల్ డీజిల్ ధరలను కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కస్టమర్లు RSP  అండ్ వారి సిటీ కోడ్‌ని 9224992249కి sms పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు, BPCL వినియోగదారులు RSP అండ్ వారి సిటీ కోడ్‌ని టైప్ చేయడం ద్వారా 9223112222కి SMS పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అయితే, HPCL వినియోగదారులు HPPrice, వారి సిటీ కోడ్‌ను 9222201122కు sms   పంపడం ద్వారా ధరలను తెలుసుకోవచ్చు.

click me!