ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ధరించిన వాచీ ధర ఏకంగా రూ. 18 కోట్లు.. ఆ వాచీ విశేషాలు ఇవే...

By Krishna Adithya  |  First Published Jun 5, 2023, 7:05 PM IST

Anant Ambani : భారత దేశంలోనే నెంబర్ వన్ పారిశ్రామికవేత్త అలాగే సంపన్నుడు అయినా ముఖేష్ అంబానీ తరచూ వార్తల్లో వస్తూనే ఉంటారు.  ఆయన వ్యాపార సంస్థల ఎదుగుదల గురించి కావచ్చు.  లేదా ఆయన సంపద గురించి కావచ్చు రకరకాలుగా కథనాలు బయటకు వస్తూనే ఉంటాయి. . అలాగే అంబానీ కుటుంబం విలాసవంతమైన జీవితం గురించి కూడా మీడియాలో పలు కథనాలు వస్తుంటాయి


Anant Ambani : ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు.  అయితే ఈ సందర్భంగా ఓ వేడుకలో అనంత్ అంబానీ ధరించిన వాచి గురించి సోషల్ మీడియాలో  కోకొల్లలుగా కథనాలు వెలువడుతున్నాయి.  అనంత అంబానీ ధరించిన వాచీ ఖరీదు సుమారు 18 కోట్ల రూపాయలు ఉంటుందని వార్త ఇప్పుడు సంచలనంగా మారింది.  అయితే అనంత అంబానీ ధరించిన వాచీ ధర అన్ని కోట్లు ఉండేందుకు కారణం ఏంటా అని నెటిజన్లు ఇప్పుడు నెట్టింట వెతుకుతున్నారు. 

 ఈ మధ్యకాలంలో చాలా మంది సినీ సెలబ్రిటీలు సంపన్నులు పారిశ్రామికవేత్తలు క్రికెటర్లు  తమ వాచ్ కలెక్షన్ల మీద ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నారు ఆ మధ్యకాలంలో క్రికెటర్ విరాట్ కోహ్లీ రెండు కోట్ల విలువచేసే రోలెక్స్ వాచ్ ధరించినట్లు కథనాలు వచ్చాయి.  అయితే అదే కోవలో  మరో క్రికెటర్ హార్దిక్ పాండ్యా సైతం 2.7 కోట్ల రూపాయలు విలువ చేసే ఓ వాచి ధరించినట్లు కూడా కథనాలు వచ్చాయి. 

Latest Videos

 ఇక ప్రపంచంలోనే అత్యంత సంపన్న సెలబ్రిటీలు ధరించే వాచీల విషయానికి వస్తే  ఫ్లాయిడ్ మేవెదర్ అనే ప్రముఖ బాక్సింగ్ ఛాంపియన్ 3.7 కోట్ల రూపాయల  వాచి ధరిస్తాడని పేరు ఉంది.  అలాగే ప్రముఖ ఫుట్ బాల్ ఆటగాడు  క్రిస్టియానో రోనాల్డో సైతం మూడు కోట్ల రూపాయల వాచి ధరిస్తాడని అంతా చెబుతున్నారు. 

 కాగా వీటన్నింటినీ తలదాన్నేలా  అనంత్ అంబానీ ఏకంగా 18 కోట్ల రూపాయలు విలువచేసే చేతి గడియారాన్ని ధరించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలిచింది.  18 కోట్ల రూపాయల వాచి అంటే ఆ ఒక్క వాచీ తో  ఓ సామాన్యుడి లైఫ్ సెటిల్ అయిపోతుందని చెప్పవచ్చు. 

18 కోట్ల రూపాయలతో అనంత అంబానీ ఈ వాచీని ప్రత్యేకంగా తయారు చేయించినట్లు తెలుస్తోంది Grandmaster Chime watch గా పిలువబడే ఈ వాచీని Patek Philippe సంస్థ తయారుచేసినట్లు తెలుస్తోంది. ఈ వాచి ఆ సంస్థ తయారు చేసిన అత్యంత ఖరీదైన ఉత్పత్తిగా అంచనా వేస్తున్నారు. గతంలో పటేక్ ఫిలిప్ సంస్థ అంబానీ కుటుంబానికి చెందిన సభ్యులకు అనేక వాచీలను తయారు చేసి ఇచ్చింది.  వాటన్నింటి విలువతో పోల్చితే అనంత అంబానీ ధరిస్తున్న వాచీ విలువ అత్యంత ఖరీదైనదని చెబుతున్నారు. మొత్తానికి త్వరలోనే రిలయన్స్ పగ్గాలను పూర్తిస్థాయిలో చేపట్టనున్న అనంత అంబానీ తన హోదాకు తగ్గట్టుగానే లగ్జరీని మెయింటైన్ చేస్తున్నాడని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 
 

click me!