సామాన్యులకు రిలీఫ్.. నేడు స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరు ధర ఏంటంటే..?

By asianet news teluguFirst Published Jan 14, 2023, 11:08 AM IST
Highlights

కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటి నుండి కొన్ని రాష్ట్రాలు కూడా ఇంధన ధరలపై వ్యాట్ కూడా తగ్గించాయి. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 8న డీజిల్‌పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ని లీటరుకు రూ.3 పెంచింది. మరోవైపు పెట్రోల్‌పై ప్రభుత్వం 0.55 పైసలు పన్నును తగ్గించింది.  
 

నేడు ఇంధన ధరలు 14 జనవరి 2023 శనివారం రోజున స్థిరంగా ఉన్నాయి, దాదాపు ఏడు నెలల పాటు  పెట్రోల్ డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.  దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.96.72గా ఉండగా,డీజిల్ ధర లీటరుకు రూ.89.62గా ఉంది. ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27గా ఉంది. గత ఏడాది మే 21న దేశ వ్యాప్తంగా ఇంధన ధరల్లో చివరిసారి మార్పు జరిగింది, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం ఇంధన ధరలు దిగోచ్చాయి.

కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటి నుండి కొన్ని రాష్ట్రాలు కూడా ఇంధన ధరలపై వ్యాట్ కూడా తగ్గించాయి. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 8న డీజిల్‌పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ని లీటరుకు రూ.3 పెంచింది. మరోవైపు పెట్రోల్‌పై ప్రభుత్వం 0.55 పైసలు పన్నును తగ్గించింది.  

చెన్నై: పెట్రోలు ధర  లీటరుకు రూ 102.63, డీజిల్ ధర  రూ 94.24

కోల్‌కతా: నేడు పెట్రోలు ధర లీటరుకు రూ. 106.03, డీజిల్ ధర రూ. 92.76

బెంగళూరు: పెట్రోలు ధర లీటరుకు రూ. 101.94, డీజిల్ ధర రూ. 87.89

లక్నో: పెట్రోల్ ధర లీటరుకు రూ. 96.57, డీజిల్ ధర రూ. 89.76

నోయిడా: పెట్రోల్ ధర లీటరుకు రూ. 96.79, డీజిల్ ధర రూ. 89.96

గురుగ్రామ్: పెట్రోల్ ధర లీటరుకు రూ. 97.18, డీజిల్ ధర రూ. 90.05

చండీగఢ్: పెట్రోలు ధర లీటరుకు రూ. 96.20, డీజిల్ ధర: రూ. 84.26

హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82.

పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రం నుండి రాష్ట్రానికి మారుతుంటాయి, ఇంకా విలువ ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వివిధ ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) సహా ప్రభుత్వ రంగ OMCలు ( IOCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలు, ఫారెక్స్ రేట్లకు అనుగుణంగా ప్రతిరోజూ ధరలను సవరిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలలో ఏవైనా మార్పులు ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి అమలు చేస్తాయి.
 

click me!