వాహనదారులకు షాకిస్తున్న ఇంధన ధరలు.. నేడు పెట్రోల్-డీజిల్ ధర మళ్ళీ పెంపు..

By Sandra Ashok KumarFirst Published Nov 28, 2020, 12:48 PM IST
Highlights

ఇంధన ధరల సవరణలో దాదాపు రెండు నెలల విరామం తరువాత చమురు కంపెనీలు గతవారం శుక్రవారం నుండి ఇంధన ధరలను పెంచడం ప్రారంభించాయి. గత తొమ్మిది రోజులలో ఎనిమిది రోజులు ఇంధన ధరలు పెరిగాయి.

చమురు మార్కెటింగ్ కంపెనీలు శనివారం పెట్రోల్, డీజిల్ ధరలను మళ్ళీ పెంచాయి. పెట్రోల్ ధర 24 పైసలు పెరిగి శనివారం లీటరుకు రూ.82.13కు చేరింది. అంతకు ముందు రోజు పెట్రోల్ లీటరు ధర రూ.81.89.

మరోవైపు డీజిల్ ధర 27 పైసలు పెరిగి లీటరుకు రూ.72.13కు చేరగా శుక్రవారం డీజిల్ ధర లీటరు రూ.71.86గా ఉంది.

ఇంధన ధరల సవరణలో దాదాపు రెండు నెలల విరామం తరువాత చమురు కంపెనీలు గతవారం శుక్రవారం నుండి ఇంధన ధరలను పెంచడం ప్రారంభించాయి. గత తొమ్మిది రోజులలో ఎనిమిది రోజులు ఇంధన ధరలు పెరిగాయి.

ఐదు రోజుల్లో పెట్రోల్ ధర 53 పైసలు, డీజిల్ ధర లీటరుకు 95 పైసలు పెరిగింది. శనివారం పెరుగుదలతో పెట్రోల్ ధరలు నవంబర్ 20 నుండి లీటరుకు 1.07 రూపాయలు, డీజిల్ లీటరుకు 1.67 రూపాయలు పెరిగాయి.

also read 

అంతకుముందు సెప్టెంబర్ 22 నుండి పెట్రోల్ ధరలు, అక్టోబర్ 2 నుండి డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇంటర్ కాంటినెంటల్ ఎక్స్ఛేంజ్ (ఐ‌సి‌ఈ) లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 48డాలర్లు దాటింది.  

ఐఓసిఎల్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం, నేడు ఢీల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నైలలో లీటర్ పెట్రోల్, డీజిల్ ధర ఈ క్రింది విధంగా ఉంది.

ఢీల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.82.13, డీజిల్ ధర లీటరుకు రూ.72.13
కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటరుకు రూ.83.67 , డీజిల్ ధర లీటరుకు రూ.75.70
ముంబై పెట్రోల్ ధర లీటరుకు రూ.88.81, డీజిల్ ధర లీటరుకు రూ. 78.66
చెన్నై పెట్రోల్ ధర లీటరుకు రూ. 85.12, డీజిల్ ధర లీటరుకు రూ. 77.56

హైదరాబాద్  పెట్రోల్ ధర లీటరుకు రూ.85.17, డీజిల్ ధర లీటరుకు రూ. 78.41.

పెట్రోల్-డీజిల్ ధరలను ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ప్రకారం మీరు మీ సిటీ కోడ్‌ను టైప్ చేసి 9224992249 నంబర్‌కు ఎస్‌ఎం‌ఎస్ పంపాలి. ప్రతి నగరానికి కోడ్ భిన్నంగా ఉంటుంది.

పెట్రోల్, డీజిల్ ధర ఉదయం 6 గంటలకు సావరిస్తారు, కొత్త ధరలను ఉదయం 6 గంటల నుండి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, ఇతర జోడించిన తరువాత దాని ధర దాదాపు రెట్టింపు అవుతుంది. చమురు కంపెనీలు ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి.

click me!