Petrol and diesel prices today: నేడు హైదరాబాద్ లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే...

Published : Aug 21, 2022, 10:16 AM IST
Petrol and diesel prices today: నేడు హైదరాబాద్ లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే...

సారాంశం

పెట్రోల్, డీజిల్ ధరల్లో ఆదివారం కూడా పెద్దగా మార్పులేమి లేవు. ఈ రోజు కూడా హైదరాబాద్‌లో పెట్రోల్ ధరలు రూ. 109.66, డీజిల్ ధర రూ. 97.82 లీటరుగా పలుకుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈరోజు (ఆదివారం), ఆగస్టు 21వ తేదీ కూడా భారత చమురు కంపెనీలు పెట్రోల్-డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా మరియు చెన్నై సహా దేశంలోని అన్ని నగరాల్లో వాహన ఇంధన ధరలు ఒకే విధంగా ఉన్నాయి.
 
ఈరోజు కూడా పెట్రోలు, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో ఇంధన ధరలను పరిశీలిస్తే, ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 96.72, డీజిల్ ధర రూ. 89.62. హైదరాబాద్‌లో పెట్రోల్ ధరలు రూ. 109.66, డీజిల్ ధర రూ. 97.82 లీటరుగా పలుకుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గుల నేపథ్యంలో మే 21 నుంచి జాతీయ మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు, 21 ఆగస్టు 2022న కూడా, ఒక లీటర్ పెట్రోల్ ధర రూ. 96.72 మరియు ఒక లీటర్ డీజిల్ ధర రూ. 89.62 వద్ద కొనసాగుతోంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) అధికారిక వెబ్‌సైట్ iocl తాజా అప్‌డేట్ ప్రకారం, లీటర్ పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63గా, డీజిల్ ధర రూ.94.24గా నిర్ణయించారు. పోర్ట్ బ్లెయిర్‌లో అతి తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ విక్రయిస్తున్నారు. అక్కడ పెట్రోల్ ధర రూ. 84.10, డీజిల్ ధర లీటరుకు రూ.79.74.గా ఉంది. రాష్ట్ర  పన్నుల కారణంగా వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్  డీజిల్ ధరలు మారుతూ ఉంటాయి.

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ప్రతిరోజూ అప్‌డేట్‌ అవుతుంటాయి
అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ఆధారంగా చమురు మార్కెటింగ్‌ కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను రోజూ నిర్ణయిస్తాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం వివిధ నగరాల పెట్రోల్ మరియు డీజిల్ ధరల సమాచారాన్ని అప్‌డేట్ చేస్తాయి.

PREV
click me!

Recommended Stories

Income Tax: ఇంట్లో డ‌బ్బులు దాచుకుంటున్నారా.? అయితే మీ ఇంటికి అధికారులు రావొచ్చు
Amazon Jobs : ఇక ఉద్యోగాలే ఉద్యోగాలు... అమెజాన్ లో 10 లక్షల జాబ్స్..!