నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే: మీ నగరంలో లీటరు ధర ఎంతో తెలుసుకొండి..

By asianet news teluguFirst Published Dec 26, 2022, 9:12 AM IST
Highlights

నేడు సోమవారం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.72, డీజిల్ రూ.89.62గా ఉంది..
 

నేడు డిసెంబర్ 26న సోమవారం పెట్రోల్, డీజిల్ ధరలో ఎలాంటి మార్పు లేదు. గత ఏడు నెలలుగా ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రతిరోజూ ఉదయం 6:00 గంటలకు ఆయిల్ కంపెనీలు ఇంధన ధరలను సమీక్షించి అప్‌డేట్ చేస్తాయి. మేలో కేంద్ర ప్రభుత్వం  పెట్రోల్‌పై లీటరుకు రూ. 8, డీజిల్‌పై లీటరుకు రూ. 6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన సంగతి మీకు తెలిసిందే. ఈ విధంగా ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు  లేకుండా వరుసగా 214వ రోజు.

పెట్రోల్-డీజిల్ ధరలు
నగరం     పెట్రోలు           డీజిల్
ముంబై     రూ. 106.31     రూ. 94.27
ఢిల్లీ     రూ. 96.65       రూ. 89.82
చెన్నై   రూ. 102.63     రూ. 94.24 
కోల్‌కతా   రూ. 106.03     రూ. 92.76 
భోపాల్    రూ. 108.65    రూ. 93.90
పాట్నా    రూ. 107.74    రూ.94.51
లక్నో     రూ. 96.62       రూ. 89.81
బెంగళూరు    రూ. 101.94     రూ. 87.89
గుర్గావ్    రూ. 97.80      రూ. 90.24
చండీగఢ్     రూ. 96.20      రూ. 84.26

హైదరాబాద్: లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82.

క్రూడాయిల్ ధర  గురించి మాట్లాడితే గత 24 గంటల్లో ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర దాదాపు 3 డాలర్లు పెరిగి బ్యారెల్‌కు 83.92 డాలర్లకు చేరుకుంది.  WTI ధర బ్యారెల్‌కు $2 డాలర్లు పెరిగి $ 79.56డాలర్లకి చేరుకుంది.

ఎక్సైజ్ పన్ను, డీలర్ కమీషన్ ఇతర ఛార్జీలు జోడించిన తరువాత ఇంధన ధరలు అసలు ధర కంటే దాదాపు  రెట్టింపు అవుతుంది. గ్లోబల్ మార్కెట్‌లో క్యూడాయిల్ ధర, డాలర్ విలువను బట్టి పెట్రోల్, డీజిల్ ధర ప్రతిరోజూ మారుతూ ఉంటుంది.

ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలు మారుతుంటాయి. పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతిరోజూ SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్  కస్టమర్లు వారి సిటీ కోడ్ ఇంకా RSP అని  టైప్ చేసి 9224992249 నంబర్‌కి ఎస్‌ఎం‌ఎస్ పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు, అయితే BPCL కస్టమర్‌లు వారి సిటీ కోడ్ ఇంకా RSP అని టైప్ చేసి  9223112222 నంబర్‌కు ఎస్‌ఎం‌ఎస్ పంపడం ద్వారా పొందవచ్చు. 
 

click me!