స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. నేడు లీటరుకు ఎంతంటే ?

By Sandra Ashok KumarFirst Published Oct 19, 2020, 6:41 PM IST
Highlights

 కరోనా లాక్ డౌన్ సడలింపు తరువాత పెట్రోల్, డీజిల్ ధరలు తార స్థాయికి చేరాయి. ప్రస్తుతం  ప్రభుత్వ చమురు కంపెనీలు వరుసగా 12వ రోజు కూడా డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు చేయలేదు. అలాగే  పెట్రోల్ ధరలో కూడా ఎటువంటి మార్పు లేదు. 

గత కొన్ని రోజులుగా ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. కరోనా లాక్ డౌన్ సడలింపు తరువాత పెట్రోల్, డీజిల్ ధరలు తార స్థాయికి చేరాయి. ప్రస్తుతం  ప్రభుత్వ చమురు కంపెనీలు వరుసగా 12వ రోజు కూడా డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు చేయలేదు.

అలాగే  పెట్రోల్ ధరలో కూడా ఎటువంటి మార్పు లేదు. ఢీల్లీలో సోమవారం పెట్రోల్ ధర లీటరుకు రూ.81.06 వద్ద స్థిరంగా ఉండగా, డీజిల్ ధర రూ.70.46. దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో ఐఓసిఎల్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం నేడు ఢీల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నైలలో లీటర్ పెట్రోల్, డీజిల్ ధర క్రింది విధంగా ఉన్నాయి...


ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.81.06, డీజిల్ ధర రూ.70.46
ముంబై పెట్రోల్ ధర రూ.87.74, డీజిల్ ధర రూ.76.86
చెన్నై పెట్రోల్ ధర రూ.84.14, డీజిల్ ధర రూ.75.95
కోల్ కత్తా పెట్రోల్ ధర రూ.82.59, డీజిల్ ధర రూ.73.99
హైదరాబాద్ పెట్రోల్ ధర రూ.84.25, డీజిల్ ధర రూ.76.84

పెట్రోల్-డీజిల్ ధరలను ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే మీరు ఆర్‌ఎస్‌పి ఇంకా మీ పిన్ కోడ్‌ను ఎంటర్ చేసి  9224992249 నంబర్‌కు ఎస్‌ఎం‌ఎస్‌ పంపాలి. పెట్రోల్, డీజిల్ ధరలు ఉదయం ఆరు గంటల నుండి మారుతుంటాయి. సవరించిన కొత్త ధరలు ఉదయం 6 గంటల నుండి అమల్లోకి వస్తాయి.

పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్ ఇతర పన్నులు జోడించిన తరువాత ఇంధన ధరలు దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలతో పాటు విదేశీ మారక ద్రవ్యాల రేటును బట్టి ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. ఈ ప్రమాణాల ఆధారంగా చమురు కంపెనీలు ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ రేటును నిర్ణయిస్తాయి. 

click me!