Petrol and Diesel Price Today: భారీగా పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే చాన్స్...?

By Krishna AdithyaFirst Published Apr 25, 2023, 11:19 AM IST
Highlights

ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరగటంతో, మన దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాహనదారుల్లో  ఆందోళన నెలకొని ఉంది. అయితే దేశీయంగా ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ ధరలు మంగళవారం కూడా స్థిరంగానే ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ 1.3 శాతం పెరిగి బ్యారెల్‌కు 82.73 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా క్రూడ్ డబ్ల్యూటీఐ కూడా 1.1 శాతం పెరిగి బ్యారెల్‌కు 78.76 డాలర్లకు చేరుకుంది. గత వారం క్రూడ్‌లో 5.5 శాతం క్షీణత నమోదైంది. మరోవైపు దేశీయంగా పెట్రోలు, డీజిల్‌లో ఎలాంటి మార్పు లేదు. దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఈరోజు 25 ఏప్రిల్ 2023న పెట్రోల్ మరియు డీజిల్ ధరలను స్థిరంగా ఉంచాయి.

రాజధాని ఢిల్లీలో 1 లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉండగా, 1లీటర్ డీజిల్ ధర రూ.89.62గా ఉంది. అదే సమయంలో ముంబైలో పెట్రోల్ రూ.106 దాటింది.  హైదరాబాదులో లీటర్ పెట్రోల్ ధర 109.66గా నమోదు అయింది అదే సమయంలో హైదరాబాద్ లో ఒక లీటర్ డీజిల్ ధర 97.82 గా నమోదయింది. 

Latest Videos

అయితే పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ నేపథ్యంలో దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే మన దేశంలో వినియోగించే చమురులో   మొత్తం విదేశాల నుంచి  దిగుమతి అయ్యే క్రూడ్ ఆయిల్ పైనే ఆధారపడి ఉంది.  ఈ నేపథ్యంలో కూడా,  క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగే కొద్దీ దేశీయంగా పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.  మరోవైపు దేశీయంగా పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకంతో పాటు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ పన్నులు వసూలు చేస్తారు. అలాగే సెస్ కూడా వసూలు చేస్తారు అందుకే డీజిల్ పెట్రోల్ ధరలు భారీగా సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. 


 

click me!