Multibagger Stock: 1 లక్ష రూపాయలు ఈ స్టాక్ లో పెట్టుబడి పెట్టి ఉంటే, 8 లక్షలు మీ సొంతం అయ్యేవి..

Published : Mar 23, 2022, 06:11 PM IST
Multibagger Stock: 1 లక్ష రూపాయలు ఈ స్టాక్ లో పెట్టుబడి పెట్టి ఉంటే, 8 లక్షలు మీ సొంతం అయ్యేవి..

సారాంశం

మార్కెట్లో మల్టీబ్యాగర్ స్టాక్స్ కోసం వెతుకుతున్నారా, అయితే ప్రముఖ బ్రోకరేజీ సంస్థ IIFL ఒక స్టాక్ పై చాలా బుల్లిష్ గా ఉంది. Persistent Systems స్టాక్ మీద సదరు సంస్థ బుల్లిష్ గా ఉండటానికి కారణం లేకపోలేదు. కంపెనీ గడిచిన 5 సంవత్సరాల్లో ఏకంగా ఒక లక్ష రూపాయల పెట్టుబడికి దాదాపు 8 లక్షల రూపాయల రిటర్న్ అందించింది.   

ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ క్లౌడ్ ప్రొవైడర్‌లతో బలమైన క్లౌడ్ భాగస్వామిగా ఒక ఎకో సిస్టం ఏర్పాటు చేసేందుకు పెర్సిస్టెంట్ సిస్టమ్స్ (Persistent Systems) గత 18 నెలలుగా గణనీయంగా పెట్టుబడులు పెడుతోంది. 220 మిలియన్ డాలర్లతో వరుస కొనుగోళ్లతో, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ ఇప్పుడు మిడ్-క్యాప్ సెక్టార్‌ కంపెనీలలో అత్యంత శక్తివంతమైన క్లౌడ్ సంస్థగా ఉంది. ఈ క్లౌడ్ సామర్ధ్యం దాని మార్కెట్ వ్యూహాన్ని బలోపేతం చేస్తుంది. 

ప్రముఖ బ్రోకరేజ్ రీసెర్చ్ హౌస్ IIFL విశ్లేషకులు ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌పై కొనుగోలు (Buy Rating) రేటింగ్‌ను కొనసాగిస్తున్నారు. అంతేకాదు 12 నెలల లక్ష్యాన్ని 5,020గా నిర్ణయించింది. Persistent Systems ఒక అగ్ర మిడ్‌క్యాప్ స్టాక్‌గా పేరు సంపాదించింది. స్టాక్ ప్రస్తుతం దూకుడు మీద ఉన్నప్పటికీ, సరఫరా ఒత్తిళ్లు ( supply-side pressure)  ప్రమాదాన్ని తెచ్చే అవకాశం ఉంది. .

డిజిటలైజేషన్ ప్రక్రియలో  క్లౌడ్ బిల్డింగ్ అనేది కీలకంగా మారింది. హైబ్రిడ్ మల్టీ-క్లౌడ్ సౌకర్యాల్లో పెరుగుతున్న IT సేవలు అందించే కంపెనీలకు Persistent Systems తన కార్యకలాపాతో విస్తరిస్తోంది. ఈ కంపెనీలు తదనుగుణంగా సామర్థ్యాలను నిర్మించగలవు." ఈ వాతావరణాన్ని పెంపొందించడంలో Persistent Systems పెద్ద పాత్ర పోషిస్తోంది. 

గార్ట్‌నర్ (Gartner) నివేదిక ప్రకారం, క్లౌడ్ సేవల వ్యాపారం 2022 నాటికి సుమారు 500 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.  ఇది సంవత్సరానికి 20 శాతం చొప్పున పెరుగుతోంది (YoY). Amazon AWS, Microsoft Azure, Google Cloud వంటి హైపర్‌స్కేలర్‌లు మీడియం టర్మ్‌లో క్లౌడ్ ఆదాయంలో సూపర్-నార్మల్ వృద్ధిని చూస్తున్నాయని బ్రోకరేజ్ సూచించింది.

ఇటీవల దిగ్గజ కంపెనీలు సేల్స్‌ఫోర్స్ (120-130 మిలియన్లకు కొనుగోలు చేసిన కాపియట్), మైక్రోసాఫ్ట్ అజూర్ (100 మిలియన్లకు కొనుగోలు చేసిన డేటా గ్లోవ్), గూగుల్ క్లౌడ్ ( 25 మిలియన్లకు , కొనుగోలు చేసిన మీడియాఅజిలిటీ), IBM క్లౌడ్ ( 100 మిలియన్లకు కొనుగోలు చేసిన Fusion360) సంస్థల ఆదాయాలతో పోల్చవచ్చు. 

IIFL  క్లౌడ్ ఎకో సిస్టంలోని అవకాశాలు అలాగే  వ్యవస్థలోని  నైపుణ్యం ఆధారంగా సంస్థ భవిష్యత్తులో మంచి రాబడిని పొందే వీలుందని అంచనా వేసింది. అలాగే కంపెనీ ఆదాయాలు కూడా స్థిరగా పెరుగుతాయని అంచనా వేస్తోంది. 

ఇక స్టాక్ పెరుగుదల విషయానికి వస్తే Persistent Systems గతేడాది మార్చి 24న 1849 రూపాయల వద్ద ట్రేడయ్యింది. నేడు ఈ స్టాక్ దాదాపు 4,489 వద్ద ట్రేడవుతోంది. అంటే ఈ స్టాక్ గడిచిన ఏడాది కాలంలో ఈ స్టాక్ రెండున్నర రెట్ల లాభాలను అందించింది. అంటే ఈ స్టాక్ లో సరిగ్గా ఏడాది క్రితం 1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే మీ డబ్బు 242,406 రూపాయలుగా మారి ఉండేది. ఇక 5 ఏళ్ల క్రితం ఈ స్టాక్ లో 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే 8 లక్షల రూపాయలు మీ సొంతం అయ్యేవి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

OYO Meaning: ఓయో అంటే అసలు అర్థం ఏమిటి? ఇది ఎందుకు సక్సెస్ అయిందో తెలిస్తే మైండ్ బ్లో అవుతుంది
Fathers Property: తండ్రి ఇంటిని నాదే అంటే కుదరదు, కొడుకులకు తేల్చి చెప్పిన హైకోర్టు