అమెజాన్ x ఫ్లిప్‌కార్ట్ వార్ వారధి ‘పేటీఎం’!!

By sivanagaprasad KodatiFirst Published Aug 31, 2018, 2:39 PM IST
Highlights

భారతదేశంలోని ఆన్ లైన్ రిటైల్ సంస్థలు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ సంస్థలతో జరిగే యుద్ధంలో బిగ్‌బాస్కెట్ సంస్థతో పేటీఎం మాల్ సంస్థ చేతులు కదిపింది.

చైనాకు చెందిన డిజిటల్ వ్యాపార సంస్థ ఆలీబాబా గ్రూప్‌ అనుబంధ సంస్థ బిగ్ బాస్కెట్‌తో దేశీయంగా ప్రాంతీయ ఈ- కామర్స్ రిటైల్ సంస్థలు వాల్ మార్ట్ - ఫ్లిప్ కార్ట్, అమెజాన్ సంస్థలతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు పోటీ పడుతున్నాయి.

ఈ పోరాటంలో ఫ్లిప్ కార్ట్, అమెజాన్ మధ్య పోటీ పోరాటంలో డిజిటల్ పేమెంట్ బ్యాంక్ ‘పేటీఎం మాల్ వారధిగా నిలుస్తోంది. భారతదేశంలోనే ఆన్ లైన్ పేమెంట్ బ్యాంకుల్లో మూడో స్థానంలో నిలిచిన పేటీఎం ఈ- కామర్స్ శరవేగంగా ప్రగతి పథంలో సాగుతోంది. 

ఇది ఫ్యూచర్ రిటైల్ ఆధ్వర్యంలోని బిగ్ బజార్, ఫ్యాషన్ షాప్స్ ఆదాయం షేరింగ్‌లో ఇప్పటికే పేటీఎం మాల్ భాగస్వామిగా మారింది. తాజాగా అలీబాబా అనుబంధ సంస్థ బిగ్ బాస్కెట్‌తో జాయింట్ వెంచర్‌లో పేటీఎం  భాగస్వామి అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ విషయాన్ని బిగ్ బాస్కెట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అమిత్ సిన్హా చెప్పారు. 

బిగ్ బాస్కెట్‌ను మా యాప్‌లో సమగ్ర పరిచే ప్రక్రియలో నిమగ్నమయ్యామని ఆ సంస్థ సీఓఓ అమిత్ సిన్హా చెప్పారు. బ్రాండ్ భాగస్వామ్యాలు, రిటైల్ పార్టనర్ షిప్‌ల కోసం కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. భారతదేశంలో దేశమంతటా రిటైల్ చైన్ నెట్ వర్క్ గల బిగ్ బజార్ తదితర సంస్థలతోనూ అనుబంధం బలోపేతానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. 

అలాగే పేటీఎం మాల్ కూడా ఇతర రిటైల్ సంస్థల్లో వాటా కొనుగోలుకు సిద్ధంగా ఉన్నది. అవసరమైతే వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం పేటీఎం మాల్ వాటా విక్రయానికి కూడా సిద్ధంగా ఉన్నది. అయితే ఫ్యూచర్ రిటైల్ సంస్థలో మైనారిటీ వాటా కొనుగోలు చేసేందుకు సిద్ధమైనట్లు వచ్చిన వార్తలను బిగ్ బాస్కెట్ సీఓఓ అమిత్ సిన్హా వివరించారు. 

భారత్ ఆన్ లైన్ రిటైల్ రంగంలో గట్టిపోటీ ఇవ్వాలని బిగ్ బాస్కెట్ భావిస్తోంది. అంతర్జాతీయంగా 200 బిలియన్ల డాలర్లకు చేరుకున్న ఈ- కామర్స్ సంస్థ చైనాలోని ఆలీబాబా, టెన్సెంట్, జపాన్ సాఫ్ట్ బ్యాంక్ తదితర సంస్థల నుంచి వాటాలను కొనుగోలుచేసింది.

సుదీర్ఘ కాలంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లతోపాటు బిగ్ బాస్కెట్ కూడా పోటీ పడుతుందని బిగ్ బాస్కెట్ సీఓఓ అమిత్ సిన్హా చెప్పారు. పేటీఎం మాల్ ద్వారా భారతదేశ మార్కెట్‌లోకి ప్రవేశించడానికి అలీబాబా సంస్థ ప్రయత్నిస్తోంది. పేటీఎం ఈ- కామర్స్‌తో వ్యూహాత్మక భాగస్వామిగా ప్రయత్నిస్తున్నామని బిగ్ బాస్కెట్ సీఓఓ అమిత్ సిన్హా తెలిపారు. 

click me!