ఇంధన ధరల అప్ డేట్: నేడు మీ నగరంలో పెట్రోల్, డీజిల్ లీటరు ధర ఎంతో తెలుసుకోండి..

By asianet news teluguFirst Published Nov 15, 2022, 8:19 AM IST
Highlights

దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం 1 లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, లీటర్ డీజిల్ రూ.89.62. ముంబైలో పెట్రోల్ ధర రూ.106.31, 1 లీటర్ డీజిల్ ధర రూ.94.27గా ఉంది. ఈ రోజు లక్నోలో 1 లీటర్ పెట్రోల్ ధర రూ. 96.79,  1 లీటర్ డీజిల్ ధర రూ. 89.76. 

న్యూఢిల్లీ:  ఇండియాలో మే నెల నుంచి పెట్రోల్-డీజిల్ ధరలు స్థిరంగా  కొనసాగుతున్నాయి. పెట్రోలియం కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు కొత్త ఇంధన ధరలను విడుదల చేస్తాయి. ఈ క్రమంలో వారంలో రెండో రోజు అంటే మంగళవారం పెట్రోల్‌-డీజిల్‌ ధరలు విడుదలయ్యాయి.  

 దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం 1 లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, లీటర్ డీజిల్ రూ.89.62. ముంబైలో పెట్రోల్ ధర రూ.106.31, 1 లీటర్ డీజిల్ ధర రూ.94.27గా ఉంది. ఈ రోజు లక్నోలో 1 లీటర్ పెట్రోల్ ధర రూ. 96.79,  1 లీటర్ డీజిల్ ధర రూ. 89.76. నోయిడాలో లీటరు పెట్రోల్ ధర రూ.96.79 కాగా, డీజిల్ ధర లీటరుకు రూ.89.96గా ఉంది. పాట్నాలో లీటర్ పెట్రోల్ రూ.107.24, లీటర్ డీజిల్ ధర రూ.94.04. గురుగ్రామ్‌లో 1 లీటర్ పెట్రోల్ ధర రూ.97.19, డీజిల్ ధర రూ.90.05. హైదరాబాద్‌లో పెట్రోలు ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82

 మీరు మీ నగరంలో పెట్రోల్-డీజిల్ ధరల గురించి తెలుసుకోవాలనుకుంటే, మీరు ఎస్‌ఎం‌ఎస్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు టోల్ ఫ్రీ నంబర్‌ను షేర్ చేశాయి. మీరు ఇండియన్ ఆయిల్ కస్టమర్ అయితే RSPని 9224992249కి, BPCL (భారత్ పెట్రోలియం) కస్టమర్ అయితే RSPని 9223112222కి ఎస్‌ఎం‌ఎస్  చేసి, మీ నగరంలో పెట్రోల్ మరియు డీజిల్ గురించి సమాచారాన్ని పొందవచ్చు. అంత్తేకాకుండా, HPCL కస్టమర్ అయితే 9222201122 నంబర్‌కు HPPriceని ఎస్‌ఎం‌ఎస్ చేయడం ద్వారా కూడా తెలుసుకోవచ్చు.

ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షించి కొత్త ధరలు జారీ చేస్తారు. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్ ఇతర జోడించిన తర్వాత దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోలు, డీజిల్‌ ఇంత ఎక్కువగా ఉండటానికి ఇదే కారణం.

click me!