ఇందుకోసం జొమాటో ఎలక్ట్రిక్ వాహనాలను సిద్ధం చేసింది. అయితే జొమాటో ఫ్లీట్‌లోని వాహనాల సంఖ్యను పేర్కొనలేదు, అయితే పెద్ద ఆర్డర్‌లను తీసుకోవడానికి ఇది ఒక మొదటి అడుగు. దీని ద్వారా క్యాటరింగ్ వ్యాపారంలోకి అడుగుపెట్టాలని జొమాటో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ముంబై : ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో ఒక వ్యక్తికి మాత్రమే కాకుండా గ్రూప్స్ లేదా ఈవెంట్స్ కోసం కూడా ఫుడ్ డెలివరీ అందించనున్నట్లు ప్రకటించింది. దింతో ఇప్పుడు Zomato "భారతదేశ మొట్టమొదటి భారీ ఆర్డర్ ఫ్లీట్"ని పరిచయం చేసింది, అంటే ఇప్పుడు గరిష్టంగా 50 మందికి ఫుడ్ ఆర్డర్ పై అందించగలదు.
ఇందుకోసం జొమాటో ఎలక్ట్రిక్ వాహనాలను సిద్ధం చేసింది. అయితే జొమాటో ఫ్లీట్‌లోని వాహనాల సంఖ్యను పేర్కొనలేదు, అయితే పెద్ద ఆర్డర్‌లను తీసుకోవడానికి ఇది ఒక మొదటి అడుగు. దీని ద్వారా క్యాటరింగ్ వ్యాపారంలోకి అడుగుపెట్టాలని జొమాటో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
అలాగే పెద్ద మొత్తంలో ఫుడ్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని జోమాటో చీఫ్ ఎగ్జిక్యూటివ్ దీపిందర్ గోయల్ ఎక్స్‌పై పోస్ట్‌లో తెలిపారు.
Zomato ఈ ఎలక్ట్రిక్ వాహనాల్లో కూలింగ్ కంపార్ట్‌మెంట్లు, హాట్ బాక్స్‌లు కూడా ఉంటాయి. ప్రస్తుతం ఈ విషయాలు పొందుపరిచే దశలో ఉన్నాయని దీపిందర్ గోయల్ తెలిపారు
జొమాటో మార్కెట్‌ను విస్తరించే ప్రయత్నంలో ఫుడ్ డెలివరీపై ఎక్కువ దృష్టి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. జూన్ 2023లో Zomato మల్టి-కార్ట్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది, దీని ద్వారా కస్టమర్లు ఒకే సమయంలో వివిధ రెస్టారెంట్‌ల నుండి ఫుడ్ ఆర్డర్ చేయడానికి సహాయపడుతుంది. మార్చి 20న, జొమాటో ప్రత్యేకంగా శాఖాహార ప్రియుల కోసం ఫుడ్ అందించడానికి గ్రీన్ యూనిఫాంలు ధరించిన డెలివరీ సిబ్బంది అందుబాటులో ఉంటారని ప్రకటించింది, అయితే తర్వాత దీనిని ఉపసంహరించుకుంది.
డిసెంబర్ త్రైమాసికంలో జోమాటో మొత్తం నిర్వహణ ఆదాయం 69 శాతం పెరిగి రూ.3,288 కోట్లకు చేరుకుంది.