బ్యాంకుల ప్రైవేటీకరణపై కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం: స్పష్టం చేసిన నిర్మలా సీతారామన్..

Ashok Kumar   | Asianet News
Published : Mar 16, 2021, 05:44 PM IST
బ్యాంకుల ప్రైవేటీకరణపై కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం:  స్పష్టం చేసిన నిర్మలా సీతారామన్..

సారాంశం

 ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి విలేకరుల సమావేశంలో తెలిపారు. మౌలిక సదుపాయాలు, అభివృద్ధికి సంబంధించిన పనులకు నిధులు సమకూర్చే విధంగా కొత్త జాతీయ బ్యాంకును ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి చెప్పారు.

న్యూ ఢీల్లీ: ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌ మంగళవారం సమావేశమైంది. సమావేశం తరువాత ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి విలేకరుల సమావేశంలో తెలిపారు.

మౌలిక సదుపాయాలు, అభివృద్ధికి సంబంధించిన పనులకు నిధులు సమకూర్చే విధంగా కొత్త జాతీయ బ్యాంకును ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి చెప్పారు.

అలాగే అన్ని బ్యాంకులు ప్రైవేటీకరించబడవని,  అలాగే ప్రైవేటీకరణకు గురైన బ్యాంక్ ఉద్యోగుల ఆసక్తి పరిరక్షించబడుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు హామీ ఇచ్చారు.

ప్రతిపాదిత బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తొమ్మిది బ్యాంక్ యూనియన్లు రెండు రోజుల పాటు సమ్మెకి పిలుపునిచ్చిన సంగతి మీకు తెలిసిందే. నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ "బ్యాంకులు దేశ ఆకాంక్షలను నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాము".అని అన్నారు.

also read మేరా రేషన్ యాప్‌ను లాంచ్ చేసిన మంత్రిత్వ శాఖ.. ఇక దేశంలోని ఏ మూల నుండి అయినా రేషన్ పొందవచ్చు.. ...

"ప్రైవేటీకరించే బ్యాంకులు, ప్రతి సిబ్బంది  ఆసక్తి పరిరక్షించబడతాయి. ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల ఆసక్తి ఖర్చులతో రక్షించబడుతుంది" అని నిర్మలా సీతారామన్ అన్నారు.

గత శనివారం, ఆదివారం రెండు రోజుల సెలవు కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడ్డాయి. మరోవైపు సోమవారం, మంగళవారం దేశవ్యాప్త సమ్మే కారణంగా కీలకమైన బ్యాంకింగ్ కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. ఈ సమ్మెలో సుమారు 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు.


బ్యాంకుల ప్రైవేటీకరణ వారి ఉద్యోగ ప్రయోజనాలను ప్రభావితం చేయదు
 ప్రైవేటీకరణకు గురయ్యే బ్యాంకులు ప్రైవేటీకరణ తర్వాత కూడా  కార్యకలాపాలను కొనసాగించగలవు. అలాగే బ్యాంక్ సిబ్బంది ప్రయోజనాలను పరిరక్షించబడతాయి. జీతం, పెన్షన్, సిబ్బందిని   పరిరక్షిస్తామని, అలాగే  మేము పబ్లిక్ ఎంటర్ప్రైజ్ పాలసీని ప్రకటించామని ఇందులో ప్రభుత్వ రంగం ఉన్న నాలుగు ప్రాంతాలను గుర్తించామని తెలిపారు. వాటిలో ఆర్థిక రంగం కూడా ఒకటి. అన్ని బ్యాంకులు ప్రైవేటీకరించబడవని ఆర్థిక మంత్రి అన్నారు.

PREV
click me!

Recommended Stories

Personal Loan: శాలరీ స్లిప్ లేకుండా వెంటనే పర్సనల్ లోన్.. ఈ పత్రాలతో గంటల్లో అప్రూవల్ !
Best Investment : బంగారం vs వెండి vs రాగి.. 2025లో ఏది కొంటే జాక్‌పాట్? నిపుణుల సీక్రెట్ ఇదే !