Nokia Lumia 500: నోకియా సూపర్ ‌ఫోన్‌తో మళ్లీ మార్కెట్‌లోకి వచ్చేసింది. లూమియా 500 5G ఫీచర్స్ తెలుసా?

Published : Jun 04, 2025, 05:53 PM IST
Nokia Lumia 500

సారాంశం

Nokia Lumia 500: ప్రపంచ సెల్ ఫోన్ దిగ్గజ కంపెనీ నోకియా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కి తిరిగి ప్రవేశించింది. ఈ సారి లూమియా 500 5G పేరుతో అత్యాధునిక ఫోన్‌ను విడుదల చేసింది. ఈ సూపర్ ఫోన్ ప్రత్యేకతలేంటో తెలుసుకుందామా? 

ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కి నోకియా తిరిగి ప్రవేశించింది. లూమియా 500 5G పేరుతో లేటెస్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ 400MP కెమెరా సెన్సార్‌తో మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. అంతేకాకుండా శక్తివంతమైన 6000 mAh బ్యాటరీ ఈ ఫోన్‌కు మరింత ప్లస్ అయ్యింది. ఫోటోగ్రఫీ ప్రొఫెషనల్స్, టెక్ ప్రియుల కోసం ప్రత్యేకంగా ఈ డివైస్ రూపొందించినట్లు నోకియా ప్రకటించింది. 

లూమియా 500 5G అట్రాక్టివ్ డిజైన్ 

ఆకర్షణీయమైన డిజైన్, బిల్డ్ క్వాలిటీతో లూమియా తయారైంది. పాత డిజైన్‌కు లేటెస్ట్ హంగులు అద్ది నోకియా ఈ ఫోన్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దింది. పోలికార్బనేట్ ఫినిష్, ప్రీమియం మెటీరియల్స్, బోల్డ్ కలర్ ఎంపికలతో ఈ డివైస్ క్లాసిక్ లూమియా లుక్కుని గుర్తుచేస్తుంది. భారీ కెమెరా, బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ మాత్రం అంత ఎక్కువ బరువు ఉండదు. 

ప్రొఫెషనల్స్ కోసం లూమియా 500 5G

విజువల్ ప్రొఫెషనల్స్ కోసం ఈ ఫోన్ లో అద్భుతమైన 6.8 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10-బిట్ కలర్ డెప్త్‌ ఈ ఫోన్ లో ఉన్నాయి. HDR10+, Dolby Vision సపోర్ట్ కలిగి ఉండడం వల్ల ఇమేజ్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. 

400 MP కెమెరా పనితీరు అద్భుతం

అత్యున్నత పరిజ్ఞానం ఆధారంగా ఈ ఫోన్‌లోని 400MP కెమెరా పనిచేస్తుంది. పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీతో తక్కువ వెలుతురు ఉన్న సమయంలోనూ ఉత్తమ ఫలితాలను అందిస్తుంది. డిజిటల్ జూమ్, క్రాప్ చేసే సామర్థ్యం ఈ కెమెరా ప్రత్యేకత.

అదనపు కెమెరా సిస్టమ్స్ 

లూమియా 500 5G ఫోన్ లో పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, అల్ట్రా వైడ్ లెన్స్, మాక్రో లెన్స్, టైమ్-ఆఫ్-ఫ్లైట్ సెన్సార్లతో కూడిన మల్టీ కెమెరా సెటప్ అమర్చారు. RAW, ProRAW ఫార్మాట్‌లు, మాన్యువల్ కంట్రోల్స్, ఫోకస్ స్టాకింగ్, HDR బ్రాకెటింగ్ వంటి ఫీచర్లు ప్రొఫెషనల్ లెవెల్‌కి తగినవిగా ఉంటాయి.

బ్యాటరీ సామర్థ్యం, పవర్ మేనేజ్‌మెంట్ 

లూమియా 500 5Gలో ఉన్న 6000mAh బ్యాటరీతో ఫుల్ డే షూట్‌లు నిర్వహించవచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్, వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్, సోలార్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వినియోగాన్ని బట్టి పవర్‌ను మేనేజ్ చేసే ఇంటెలిజెంట్ అల్గోరిథమ్‌లు బ్యాటరీ లైఫ్ టైమ్ ను పెంచుతాయి.

పెర్ఫార్మెన్స్, సాఫ్ట్‌వేర్ 

ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్, డెడికేటెడ్ ఇమేజ్ ప్రాసెసింగ్ యూనిట్లు, అధిక RAM, స్టోరేజ్ ద్వారా ఈ ఫోన్ ప్రొఫెషనల్ ఎడిటింగ్ అవసరాలకు తగినట్లుగా పనిచేస్తుంది. 5G కనెక్టివిటీ, క్లౌడ్ బ్యాకప్, స్పెషలైజ్డ్ కెమెరా యాప్‌లు, హార్డ్‌వేర్ యాక్సిలరేటెడ్ గ్యాలరీలు దీనిలో ప్రత్యేకంగా ఉన్నాయి.

మార్కెట్ ప్రభావం 

నోకియా లూమియా 500 5G మొబైల్ ఫోటోగ్రఫీకి చాలా బాగుంటుంది. ప్రొఫెషనల్స్, ఉత్సాహవంతుల కోసం అత్యాధునిక కెమెరా టెక్నాలజీని ఈ ఫోన్ లో వాడారు. ఈ ఫోన్ ద్వారా నోకియా తన టెక్నాలజీ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మీలో ఈ మూడు విషయాలుంటే చాలు..! సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ కావచ్చు.. అంబానీ అవ్వొచ్చు
Aadhaar PAN Link : డిసెంబర్ 31 డెడ్‌లైన్.. ఆధార్, పాన్ లింక్ చేయకపోతే ఏం జరుగుతుంది?