Nokia New Logo: 60 ఏళ్ల తర్వాత తొలిసారి లోగో మార్చిన నోకియా, కొత్త లోగో ఇదే...మార్కెట్లో సత్తా చాటే ప్రయత్నం

Published : Feb 27, 2023, 01:28 PM IST
Nokia New Logo: 60 ఏళ్ల తర్వాత తొలిసారి లోగో మార్చిన నోకియా, కొత్త లోగో ఇదే...మార్కెట్లో సత్తా చాటే ప్రయత్నం

సారాంశం

నోకియా తన ఐకానిక్ లోగోను మార్చింది. 60 ఏళ్లలో తొలిసారిగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఒకప్పుడు బలమైన మొబైల్ ఫోన్‌లకు ప్రసిద్ధి చెందిన నోకియా, ప్రస్తుతం ఇతర కంపెనీలతో పోలిస్తే సేల్స్ విషయంలో వెనుకడుగు వేసింది.  అయితే ఇప్పుడు కంపెనీ తన లోగోను మార్చడం ద్వారా మార్కెట్లోకి రీఎంట్రీ ఇస్తున్నామని  బలమైన సంకేతాలను పంపింది. 

ఒకప్పుడు ప్రతి చేతిలో కనిపించిన నోకియా మొబైల్ బ్రాండ్ ఇప్పుడు కొత్త డిజైన్ లో కనిపించబోతోంది. 60 ఏళ్ల తర్వాత కంపెనీ తన లోగోను మార్చుకుంది. నోకియా త్వరలో భారీ ఎత్తున ప్లాన్స్ తో మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగా తమ బ్రాండ్ లోగోను రీడిజైన్ చేసి విడుదల చేయనుంది. కొత్త నోకియా లోగో ఇది 5 విభిన్న డిజైన్లతో రానుంది. ఇంతకుముందు, నోకియా లోగో నీలం రంగులో ఉండేది, కానీ కొత్త లోగో అనేక రంగుల కలయికతో, లుక్ చాలా ఆకర్షణీయంగా ఉంది.

నోకియా వ్యూహం ఇదే..
బార్సిలోనాలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC 2023)కి ముందు సాయంత్రం నోకియా CEO పెక్కా లండ్‌మార్క్ మాట్లాడుతూ, కొత్త లోగో తమ కంపెనీ లక్ష్యాలను చేరుకునేందుకు సరికొత్త కనెక్షన్‌ అందిస్తుందని సూచించారు. ఇప్పటికీ మా కస్టమర్‌లను దృష్టిలో ఉంచుకుని మార్కెట్లో సుస్థిర స్థానం వైపు కదులుతున్నాము. నోకియా బ్రాండ్. నెట్‌వర్క్, డిజిటలైజేషన్‌పై ఎక్కువ దృష్టి సారిస్తోందని తెలిపారు.

నోకియా 2014లో మైక్రోసాఫ్ట్ చేతుల్లోకి వెళ్లింది...
2014లో, నోకియా మొబైల్ వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత బ్రాండ్పేరును నిలిపివేసింది. అనంతరం HMD ఇంటర్నేషనల్ సంస్థ ఈ పేరుతో ఫోన్‌లను విక్రయించడానికి లైసెన్స్ పొందింది.

నోకియా నుంచి మార్కెట్లోకి వస్తున్న తాజా స్మార్ట్‌ఫోన్‌లు ఇవే..
ఇటీవల నోకియా తన మూడు కొత్త మరియు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఇందులో Nokia C32, Nokia G22, Nokia C22 ఉన్నాయి. కాగా  Nokia G22 ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఫోన్ బ్యాక్ కవర్ 100% రీసైకిల్ ప్లాస్టిక్‌తో తయారు చేసింది. కస్టమర్‌లకు తమ ఇంటి వద్దే  బ్యాటరీ, డిస్‌ప్లే, ఛార్జింగ్ పోర్ట్‌ రిపేర్ సదుపాయం కల్పిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.  ఇందుకోసం మొబైల్ ఫోన్‌తో పాటు IFIXIT కిట్‌ను కూడా కంపెనీ ఉచితంగా ఇస్తోంది. దీని సహాయంతో మొబైల్ లోని భాగాలను మీరే మార్చుకోవచ్చు.

నోకియా జీ22, నోకియా సీ22 స్మార్ట్‌ఫోన్‌ల విడుదల
 కంపెనీ తన రెండు కొత్త సి-సిరీస్ హ్యాండ్‌సెట్‌లు నోకియా సి 32, నోకియా సి 22 ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. దీనితో పాటు, కంపెనీ నోకియా G22 ను కూడా మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌లలో పవర్ ఫుల్ బ్యాటరీ అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్  బ్యాటరీ AI పవర్డ్ బ్యాటరీ సేవింగ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీతో వస్తోంది. ఈ టెక్నాలజీ సహాయంతో, వినియోగదారులు మరిన్ని బ్యాకప్‌లను పొందవచ్చు. దీనితో పాటు, ఈ సరికొత్త నోకియా ఫోన్‌లో HD డిస్‌ప్లే,  మిడ్-రేంజ్ ప్రాసెసర్ ఉన్నాయి. నోకియా C22 ప్రారంభ ధర సుమారు రూ.9,556. Nokia G22 ప్రారంభ ధర దాదాపు రూ.15,694గా నిర్ణయించారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: ట్రాఫిక్ క‌ష్టాల‌కు చెక్‌.. హైద‌రాబాద్‌లో మ‌రో ఫ్లై ఓవ‌ర్‌, 6 లైన్ ఎక్స్‌ప్రెస్ వే
Business Idea: మీ బిల్డింగ్‌పై ఖాళీ స్థ‌లం ఉందా.? మీరు ల‌క్షాధికారులు కావ‌డం ఖాయం