Gautam Adani: గౌతమ్ అదానీ ఆసక్తికర వ్యాఖ్యలు.. అదే జ‌రిగితే దేశంలో ఆక‌లి కేక‌లు ఉండ‌వంటా..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Apr 22, 2022, 12:06 PM IST
Gautam Adani: గౌతమ్ అదానీ ఆసక్తికర వ్యాఖ్యలు.. అదే జ‌రిగితే దేశంలో ఆక‌లి కేక‌లు ఉండ‌వంటా..!

సారాంశం

అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ గౌతమ్ అదానీ భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భారత్ 30 ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్నారు. అదే జ‌రిగితే దేశంలో ఎవ‌రూ ఖాళీ క‌డుపుతో ఎవ‌రూ నిద్ర‌పోరు అని ఆయ‌న అన్నారు.  

ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ ఆదానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ 30 ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్నారు. అలా మారితే ఆకలి కేకలు లేని (ఎవరూ ఖాళీ కడుపుతో ఉండని) దేశంగా భారత్ మారుతుందని అన్నారు. మనం 2050 సంవత్సరానికి దాదాపు 10,000 రోజుల దూరంలో ఉన్నామని అన్నారు. ఈ కాలంలో మన ఆర్థిక వ్యవస్థకు సుమారు 25 ట్రిలియన్‌ల డాలర్లను జోడించగలమని తాను అంచనా వేస్తున్నట్టు తెలిపారు.

ఇది మన జీడీపీకి 2.5 బిలియన్ల డాలర్లు అదనంగా జోడించినట్టు అవుతుందన్నారు. ఈ కాలంలో మనం అన్ని రకాల పేదరికాన్ని నిర్మూలించగలమని తాను ఆశిస్తున్నట్టు చెప్పారు. ఆర్థిక వ్యవస్థ ప్రణాళికాబద్ధంగా వృద్ధి చెందితే, ఈ 10,000 రోజుల్లో మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో స్టాక్ మార్కెట్లు సుమారు 40 ట్రిలియన్‌ డాలర్లను అందిస్తాయని అన్నారు. 1.4 బిలియన్ల జీవితాలను ఉద్ధరించడం అనేది స్వల్పకాలంలో మారథాన్‌గా అనిపించవచ్చు, కానీ దీర్ఘకాలంలో ఇది స్ప్రింట్ అని అదానీ తెలిపారు.

2050 కల్లా 30 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ. 2250 లక్షల కోట్ల) ఆర్ధిక వ్యవస్థగా అవతరించాలన్న లక్ష్యాన్ని భారత్ సాధిస్తే.. దేశంలో ఎవరూ ఖాళీ కడుపుతో నిద్రించని దేశంగా నిలుస్తుందని అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ అన్నారు. 2050కి ఇంకా సుమారు 10,000 రోజుల దూరంలో ఉన్నాం. మన ఆర్థిక వ్యవస్థకు మరో 25 లక్షల కోట్ల డాలర్లు చేరతాయని నేను భావిస్తున్నాను. అంటే జీడీపీకి రోజుకు 250 కోట్ల డాలర్ల సంపద జతవ్వాల్సి ఉంటుంది. ఇదే జరిగితే దేశంలో అన్ని రకాలుగా పేదరికం తొలగిపోతుందని అనుకుంటున్నానని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయ‌న అన్నారు. ఈ 10,000 రోజుల్లో స్టాక్ మార్కెట్లలోని కంపెనీల మార్కెట్ విలువ కూడా 40 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ. 3000 లక్షల కోట్లు) మేరకు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అంటే మదుపర్ల సంపద రోజుకు 400 కోట్ల డాలర్ల (సుమారు రూ.30,000 కోట్ల) మేర పెరగాలని పేర్కొన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

OYO Meaning: ఓయో అంటే అసలు అర్థం ఏమిటి? ఇది ఎందుకు సక్సెస్ అయిందో తెలిస్తే మైండ్ బ్లో అవుతుంది
Fathers Property: తండ్రి ఇంటిని నాదే అంటే కుదరదు, కొడుకులకు తేల్చి చెప్పిన హైకోర్టు