నిజాం మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్..ఎలాన్ మస్క్ కన్నా ధనవంతుడా ? మస్క్ కు సైతం అసూయ పుట్టించే నిజాం ఆస్తుల విలువ ఎంత

By Krishna Adithya  |  First Published Aug 4, 2023, 6:25 PM IST

ప్రస్తుతం కాలంలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎవరు అనగానే మనందరికీ గుర్తొచ్చే పేరు ఎలాన్ మస్క్.  ఇక ఆసియాలో అత్యంత సంపన్నుడు అనగానే గుర్తొచ్చే పేర్లు ముఖేష్ అంబానీ,  గౌతమ్ అదానీ పేరు వినిపిస్తూ ఉంటాయి. . అయితే ప్రపంచంలోనే నెంబర్ వన్ ధనవంతుడి  కిరీటాన్ని ధరించి 40 సంవత్సరాల పాటు అదే స్థాయిలో కొనసాగిన వ్యక్తి ఓ హైదరాబాదీ అంటే మీరంతా ఆశ్చర్య పోవాల్సిందే. 


ప్రపంచంలోనే నెంబర్ వన్ ధనవంతుడిగా మైక్రోసాఫ్ట్ అధినేత  బిల్ గేట్స్.  22 సంవత్సరాలు ఆ స్థానంలో ఉండగా, అందులో మధ్యలో మూడు సంవత్సరాలు ఆ స్థానం కోల్పోయారు.  1995 నుంచి 2017 వరకు  బిల్ గేట్స్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మొదటి స్థానాన్ని ఆక్రమించారు కాగా 2008లో ఓసారి 2012 సంవత్సరంలో ఓసారి ఆయన మొదటి స్థానాన్ని కోల్పోయారు.  అయితే బిల్ గేట్స్ కన్నా రెండు రెట్లు  ఎక్కువ కాలం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచిన ఘనత హైదరాబాద్ చివరి నిజాం  మీరు ఉస్మాన్ అలీ ఖాన్ కు దక్కుతుంది.  అవును మీరు విన్నది నిజమే మీరు ఉస్మాన్ అలీ ఖాన్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడి జాబితాలో 40 సంవత్సరాలు ఏకచత్రాధిపత్యంగా నిలిచారు.  ఆయన సంపద ముందు  అటు పశ్చిమ దేశాల బిలియనీర్లతోపాటు,  అరబ్ దేశాల రాజవంశస్తులు సైతం  సరితూగే వారు కాదు,  

చరిత్రను పరిశీలిస్తే, మీర్ ఉస్మాన్ అలీఖాన్ భారతదేశ చరిత్రలో అత్యంత ధనవంతుడు. ఆయన 7వ నిజాం, హైదరాబాద్ చివరి నవాబు. స్వాతంత్రం వచ్చినప్పుడు, భారతదేశం అనేక రాచరిక రాజ్యాలుగా విభజించబడింది. హైదరాబాద్, జునాగఢ్, జమ్మూ కాశ్మీర్ మినహా, భారతదేశంలోని అన్ని సంస్థానాలు ఇండియన్ యూనియన్‌లో చేరాలని నిర్ణయించుకున్నాయి. ఈ రాష్ట్రాలలో హైదరాబాద్ అత్యంత సంపన్నమైనది. 1911 నుండి 1948 వరకు 37 సంవత్సరాలు హైదరాబాద్‌ను పాలించిన నిజాం ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ చివరి నవాబు. ఆయన ఏప్రిల్ 6, 1886 న జన్మించాడు, ఫిబ్రవరి 24, 1967 న మరణించాడు. 1948కి ముందు  ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా  ఆయన కీర్తి గడించారు. 

Latest Videos

1911లో, ఉస్మాన్ అలీఖాన్ తన తండ్రి తర్వాత హైదరాబాద్ నిజాం పీఠానికి రాజు అయ్యాడు దాదాపు 40 సంవత్సరాలు ఆ పదవిలో ఉన్నాడు. అతని కాలంలో ఉస్మాన్ అలీ ఖాన్ నికర విలువ రూ. 17.47 లక్షల కోట్లు (230 బిలియన్లు డాలర్లు) పైనే ఉంది. ఖాన్ నికర విలువ దాదాపు ఎలోన్ మస్క్‌తో సమానం. మస్క్ ఇప్పుడు 230 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్నారు

50 రోల్స్ రాయిస్‌లకు నిజాం యజమాని

1911లో, ఉస్మాన్ అలీ ఖాన్‌కు నైట్ గ్రాండ్ కమాండర్ ఆఫ్ స్టార్ ఆఫ్ ఇండియా గౌరవ బిరుదు లభించింది. అతనికి 1917లో బ్రిటిష్ సామ్రాజ్యం నైట్ గ్రాండ్ క్రాస్ ర్యాంక్ కూడా లభించింది. అతను 1946లో రాయల్ విక్టోరియా చైన్‌ని కూడా అందుకున్నాడు. కొన్ని నివేదికల ప్రకారం, అతను 50 కంటే ఎక్కువ రోల్స్ రాయిస్‌లను కలిగి ఉన్నాడనే పేరుంది. 

మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాదు సంస్థానం యూనియన్ ఆఫ్ ఇండియాలో చేరడానికి ముందు పాలించిన ఏడుగురు నిజాంలలో ఒకరు. అతను ప్రసిద్ధ జాకబ్ డైమండ్‌తో సహా సుమారు 400 మిలియన్ల విలువైన ఆభరణాలను కలిగి ఉన్నాడు, దాని విలువ ఇప్పుడు 95 మిలియన్లు. అయితే, 1948లో నవాబు తన రాజ్యాన్ని వదులుకుని రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో చేరవలసి వచ్చింది. హైదరాబాద్ భారత దేశంలో విలీనమైన తర్వాత నిజాం ఆదాయ వనరులు క్షీణించాయి.

 

click me!