హెయిర్ స్టైల్‌ కోసం కూడా స్పెషలిస్ట్.. నీతా అంబానీ వీడియో వైరల్..

By Ashok kumar Sandra  |  First Published Jun 4, 2024, 11:08 AM IST

నీతా అంబానీ ధరించే బట్టల నుండి వాచ్, నెక్లెస్ వరకు ప్రతిది ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తోంది. తాజాగా నీతా అంబానీ   హెయిర్ స్టయిల్ చెదరకుండా ఉండడానికి ఒక ఉద్యోగిని ఉన్నాడని సూచించే వీడియో వైరల్‌గా మారింది.  
 


ముఖేష్ అంబానీ కుటుంబం ఏం చేసినా పెద్ద వార్తే. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో అంబానీ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి.తాజాగా అనంత్ అంబానీ అండ్ రాధిక మర్చంట్ ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్ ఇటలీలో లగ్జరీ  ట్రిప్ తో  ముగిసింది. మే 29 నుంచి జూన్ 1 వరకు నాలుగు రోజుల పాటు జరిగిన ఈ ఈవెంట్లో బాలీవుడ్ తారలు, విదేశీ ప్రముఖులు కూడా  పాల్గొన్నారు. కాగా, కొద్ది రోజుల క్రితం ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో నీతా ఒక ఈవెంట్‌లో పాల్గొనడానికి వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఆమె హెయిర్ స్టైల్‌ను సెట్ చేస్తూ కనిపిస్తాడు. అయితే  హెయిర్‌స్టైల్ పాడవకుండా చూసుకోవడానికి నీతా అంబానీకి ఒక ఉద్యోగి కూడా ఉన్నాడు. ఇది చూసిన నెటిజన్లు   రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. 

నీతా అంబానీకి 60 ఏళ్లు దాటినా ఆమె అందం ఒక్కటే కాదు డ్రెస్, హెయిర్ స్టైల్, మేకప్, నగలు ఇలా ప్రతి విషయంలోనూ చాలా శ్రద్ధ చూపిస్తుంది. ఇప్పుడు ఆమె  ధరించే ఖరీదైన చీరలు, దుస్తులు, నెక్లెస్‌లు, వాచీలు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. రకరకాల ఈవెంట్స్‌లో స్టైలిష్‌గా కనిపించే నీతా అంబానీ అందంలో ఏ బాలీవుడ్ స్టార్‌కి తక్కువ కాదు. 

Latest Videos

ఈ ఏడాది మార్చిలో ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన 'మిస్ వరల్డ్ 2024' కార్యక్రమానికి నీతా అంబానీ హాజరయ్యారు. ఆ సందర్భంగా ఓ వ్యక్తి తన జుట్టును సరిచేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. చాలా మంది అది వాళ్ళు మాత్రమే ఇలా చేయగలరని కామెంట్స్ చేస్తున్నారు.

అదేవిధంగా మార్చిలో జరిగిన 'మిస్ వరల్డ్ 2024' కార్యక్రమంలో నీతా అంబానీ మిస్ వరల్డ్ ఫౌండేషన్ ఇచ్చే 'మానవతావాది' అనే అవార్డుతో సత్కరించింది. స్వచ్ఛంద, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే  నీతా అంబానీకి ఈ అవార్డు లభించింది. ఈ సందర్భంగా నీతా అంబానీ కట్టుకున్న చీరకు కూడా ప్రశంసలు అందాయి. నల్లటి బనారసీ చీర కట్టుకున్న నీతా అంబానీకి 60 ఏళ్లు అంటే ఎవరూ నమ్మనంత అందంగా కనిపించారు. ఈ చీరపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. 

నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో  సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఈ సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. నీతా అంబానీ కూడా అప్పుడప్పుడు విలాసవంతమైన పార్టీలు నిర్వహిస్తుంది. ఇందులో బాలీవుడ్ స్టార్స్ సహా పలువురు ప్రముఖులు కూడా పాల్గొంటున్నారు. ఆమె లగ్జరీ పార్టీలు కూడా వార్తల్లో నిలుస్తున్నాయి. 

 

click me!