పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ ఉదయం 8 గంటలకు మొదలైంది. ఈ ఎన్నికల ఫలితాలను బట్టి స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనవుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
నేడు జూన్ 4 2024న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ఎన్నికల ఫలితాలు స్టాక్ మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది ఈ రోజు నిర్ణయించనుంది. ఇక ఈరోజు సెన్సెక్స్ 76385 వద్ద, నిఫ్టీ 23179తో ట్రేడవుతుంది,
పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ ఉదయం 8 గంటలకు మొదలైంది. ఈ ఎన్నికల ఫలితాలను బట్టి స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనవుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఎన్నికల సర్వేల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఇప్పటికే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవ్వాల ముంబై స్టాక్ సూచీ సెన్సెక్స్ అండ్ జాతీయ స్టాక్ మార్కెట్ నిఫ్టీ రెండు నష్టాలను నమోదు చేశాయి. ఇదే సమయంలో గతంలో సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త గరిష్టాలను తాకాయి.
ఎగ్జిట్ పోల్ అంచనాలతో జూన్ 1న ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 2,000 పాయింట్లు ఎగబాకడంతో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు ఆనందం వ్యక్తం చేశారు. సెన్సెక్స్ 2038.75 పాయింట్లు పెరిగి 76,000.06 వద్ద ముగియడం ద్వారా రోజంతా ట్రెండ్ కొనసాగింది. నిఫ్టీ 620.80 పాయింట్లు పెరిగి 23,151.50 పాయింట్ల వద్ద ముగిసింది.