Netflix lays off 300 employees: 300 మంది ఉద్యోగులను తొలగించిన నెట్ ఫ్లిక్స్, ఆదాయం తగ్గడంతో నిర్ణయం..

By team teluguFirst Published Jun 24, 2022, 10:24 AM IST
Highlights

ప్రముఖ స్ట్రీమింగ్ కంపెనీ నెట్‌ఫ్లిక్స్ 300 మంది ఉద్యోగులను తొలగించింది. తమ వినియోగదారులలో గణనీయమైన తగ్గుదల వల్ల ఆదాయం కోల్పోవాల్సి రావడంతో ఈ నిర్ణయం తీదుకున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది.

గతంలో 150 ఉద్యోగులను తొలగించిన నెట్ ఫ్లిక్స్ తాజాగా మరో 300 మందిని తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ తగ్గడం సాకుగా చూపుతూ నెట్ ఫ్లిక్స్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే  తొలగించిన ఉద్యోగులందరూ అమెరికా బేస్ గా పని చేస్తున్నవారే కావడం గమనార్హం. 

"మేము ఈ వ్యాపారంలో భారీగా పెట్టుబడులు పెట్టి కొనసాగిస్తున్నప్పుడు, సంస్థ అభివృద్ది కోసం ఈ సర్దుబాట్లను దృష్టిలో ఉంచుకునే చేసాము, తద్వారా మా  ఆదాయ వృద్ధికి అనుగుణంగా మా ఖర్చులు పెరుగుతాయి" అని కంపెనీ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు.  "నెట్‌ఫ్లిక్స్ కోసం వారు చేసిన సేవకు మేము చాలా కృతజ్ఞులం, అయితే ఈ కఠినమైన నిర్ణయం ద్వారా వారికి మద్దతు ఇవ్వడానికి కృషి చేస్తున్నాము." అని తెలిపారు. 

గురువారం నాటి తొలగింపులు నెట్‌ఫ్లిక్స్ వర్క్‌ఫోర్స్‌లో 3 శాతం మందిని ప్రభావితం చేశాయి, ఇందులో 11,000 మంది పూర్తి సమయం ఉద్యోగులు ఉన్నారు. తొలగింపులు కూడా ఎక్కువగా అమెరికాలోనే జరుగుతున్నాయి. 

నెట్‌ఫ్లిక్స్ ఏప్రిల్‌లో  భారీ సబ్ స్క్రైబర్లను కోల్పోయింది. వాల్ స్ట్రీట్ లో నెట్‌ఫ్లిక్స్ మార్కెట్ క్యాప్ నుండి బిలియన్ డాలర్లను తుడిచిపెట్టడానికి దారితీసింది. ఈ ఏడాది కంపెనీ స్టాక్ దాదాపు 70% క్షీణించింది. గత నెలలో, నెట్‌ఫ్లిక్స్ 150 మంది కార్మికులను తొలగించింది, ఆదాయ వృద్ధి మందగించడంతోనే ఈ నిర్ణయం తీసుకుంది.  అంతకు ముందు  గత నెల చివరిలో, నెట్‌ఫ్లిక్స్ తన మార్కెటింగ్ శాఖ పునర్నిర్మాణంలో భాగంగా స్ట్రీమింగ్ సేవ కోసం చలనచిత్రాలు, టీవీ షోలను ప్రమోట్ చేసే వెబ్‌సైట్ ‘టుడమ్’లో అనేక మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించింది.

నెట్‌ఫ్లిక్స్ (NFLX) దాదాపు 221.6 మిలియన్ సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉన్న ప్లాట్‌ఫారమ్‌. దీనిని తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడానికి అనేక మార్గాలను అన్వేషిస్తోంది.   ద్రవ్యోల్బణానికి తోడు, రష్యా -  ఉక్రెయిన్ మధ్య యుద్ధం సంస్థపై ప్రభావం చూపిస్తోంది. సంస్థ కార్యకలాపాలు ప్రారంభించిన దశాబ్ద కాలంలో ఈ స్థాయిలో చందాదారులను కోల్పోవడం ఎప్పుడూ లేదు. దీంతో మరింత మంది చందాదారులను కోల్పోకుండా ఉండేందుకు, కొత్త వారిని ఆకర్షించేందుకు ప్రకటనలతో కూడిన చౌక ప్లాన్లను తీసుకురావాలని నిర్ణయించింది. 

click me!