సిబిఐ చేతికి యెస్ బ్యాంక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ హత్య కేసు.. ఆ కారణంగానే హత్య చేసారంటూ ఆరోపణ..

Ashok Kumar   | Asianet News
Published : Jan 21, 2021, 06:23 PM ISTUpdated : Jan 21, 2021, 11:32 PM IST
సిబిఐ చేతికి యెస్ బ్యాంక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ హత్య కేసు.. ఆ కారణంగానే హత్య చేసారంటూ ఆరోపణ..

సారాంశం

యెస్ బ్యాంక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ హత్య   జరిగి ఐదు నెలల కావొస్తున్న హర్యానా పోలీసుల ధర్యాప్తులో ఎలాంటి పురోగతి లేనందున సిబిఐ ఈ కేసును తీసుకుంది.

న్యూ ఢీల్లీ: యెస్ బ్యాంక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ధీరజ్ అహ్లవతి (38) కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)కి అప్పగించింది. ఈ సంఘటన జరిగి ఐదు నెలల కావొస్తున్న హర్యానా పోలీసుల ధర్యాప్తులో ఎలాంటి పురోగతి లేనందున సిబిఐ ఈ కేసును తీసుకుంది.

ఆగస్టు 5న ఢీల్లీలోని రోహిణిలోని కాలువలో ధీరజ్ మృతదేహం లభ్యమైంది. ధీరజ్‌ను అపహరించి చంపారని కుటుంబం ఆరోపించిచారు. కార్పొరేట్ రుణాల సమస్యల కారణంగానే ధీరజ్ ను  హత్య చేసినట్లు కుటుంబం తెలిపింది.

 ఉదయం నడక కోసం బయలుదేరిన ధీరజ్ తిరిగి ఇంటికి రాలేదని, రెండు రోజుల తరువాత ఒక కాలువలో అతని మృతదేహం లభించిందని పోలీసులు తెలిపారు.

also read అమెరికా మాజీ అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా ట్రంప్ టాయిలేట్ కుంభకోణం.. ? ...

ధీరజ్ సోదరి అతని చేతికి ధరించిన రాఖీ ద్వారా మృతదేహాన్ని గుర్తించి అది ధీరజ్ మృతదేహామని ధృవీకరించింది. ఈ సంఘటనపై దర్యాప్తు కోసం హర్యానా పోలీసుల ప్రత్యేక బృందాన్ని  కూడా ఏర్పాటు చేశారు.

స్థానిక పోలీసుల దర్యాప్తులో ఎటువంటి పురోగతి లేకపోవడంతో ధీరజ్ కుటుంబం అక్టోబర్‌లో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్‌ను కలిసి ఈ కేసును సిబిఐకి అప్పగించాలని కోరింది.

ఈ కేసుపై సిబిఐ దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 17న సిఫారసు చేసింది. తరువాత  జనవరి 6న ఈ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఎఫ్ఐఆర్ లో హత్య, కిడ్నాప్ కింద కేసులు నమోదు  చేశారు.

PREV
click me!

Recommended Stories

Bank Locker : బ్యాంక్ లాకర్‌లో బంగారం పెట్టారా? ఈ ఒక్క పని చేయకపోతే భారీ నష్టం
Most Expensive Metals: బంగారం కాదు.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన మెటల్స్ ఇవే