Multibagger Stock: ఏడాదిలో మీ డబ్బును డబుల్ చేసిన స్టాక్ ఇదే...

Published : Jun 07, 2022, 07:06 PM IST
Multibagger Stock: ఏడాదిలో మీ డబ్బును డబుల్ చేసిన స్టాక్ ఇదే...

సారాంశం

గత కొన్ని నెలలుగా భారత స్టాక్ మార్కెట్‌లో మందగమనం కొనసాగుతోంది. 2022 సంవత్సరం ప్రారంభంలో, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు మంచి లాభాలను అందించింది, అయితే ఈ మార్కెట్ బూమ్ ఎక్కువ కాలం కొనసాగలేదు. బేర్స్ పతనం మార్కెట్‌ను తన గ్రిప్‌లోకి తీసుకుంది. అయితే, కొన్ని స్టాక్‌లు మాత్రం మార్కెట్ పతనంలో కూడా మల్టీబ్యాగర్ (Multibagger Return) రాబడిని ఇస్తున్నాయి. FY 2022 నాల్గవ త్రైమాసికంలో, స్టాక్ మార్కెట్లో 90 స్టాక్‌లు మల్టీబ్యాగర్ రాబడిని ఇచ్చాయి.  

వికాస్ లైఫ్‌కేర్ స్టాక్ (Vikas Lifecare share) కూడా మల్టీబ్యాగర్ లాభాలను అందించింది. గత ఏడాది నుంచి ఈ స్టాక్ ఇన్వెస్టర్లకు మంచి రాబడులు ఇస్తోంది.  సంస్థాగత పెట్టుబడిదారులు ఈ స్టాక్‌ను కొనుగోలు చేశారు. నోమురా సింగపూర్ లిమిటెడ్, ఫోర్బ్స్ EMF, AG డైనమిక్ ఫండ్స్ లిమిటెడ్ మల్టీబ్యాగర్ స్టాక్ వికాస్ లైఫ్‌కేర్ షేర్లను కొనుగోలు చేశాయి.

Moneycontrol పోర్టల్ నివేదిక ప్రకారం, వికాస్ లైఫ్ కేర్ ఫండ్ రైజింగ్ డ్రైవ్ కింద మొత్తం 12,50,00,000 ఈక్విటీ షేర్లను జారీ చేసింది. కంపెనీ ఈ ఆఫర్ 25 మే 2022న తెరుచుకుంది. 2 జూన్ 2022 వరకు ఇది కొనసాగింది. ఈ ఫండ్ రైజింగ్ డ్రైవ్‌లో ఫోర్బ్స్ EMF 5,40,00,000 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. నొమురా సింగపూర్‌కు 4,40,00,000 ఈక్విటీ షేర్లు కేటాయించారు. అదే సమయంలో, AG డైనమిక్ ఫండ్స్ లిమిటెడ్ షేర్‌లో 2,70,00,000 ఈక్విటీ షేర్లను కేటాయించారు. ఒక్కో షేరుకు రూ.4 చొప్పున ఈ షేర్లను కేటాయించారు.

వికాస్ లైఫ్ కేర్ స్టాక్ ఏడాది పొడవునా దాని పెట్టుబడిదారులకు బలమైన రాబడిని ఇచ్చింది. గత నెలలో కంపెనీ షేరు ధర రూ.4.60 నుంచి రూ.5.40కి పెరిగింది. ఈ విధంగా, ఈ నెలలోనే ఈ స్టాక్‌లో 15% జంప్ చోటు చేసుకుంది. 2022లో కంపెనీ షేర్ ధర 25 శాతం పెరిగింది. గత 6 నెలలుగా పరిశీలిస్తే, కంపెనీ షేర్లు పెట్టుబడిదారులకు 60 శాతం రాబడిని ఇచ్చాయి. ఈ స్టాక్ గత ఏడాది కాలంలో మల్టీబ్యాగర్‌గా నిలిచింది. మే 7న ఎన్‌ఎస్‌ఈలో ఈ స్టాక్ ముగింపు ధర రూ.2.66గా ఉంది, అది ఇప్పుడు రూ.5.40కి పెరిగింది. ఈ విధంగా, ఈ స్టాక్ ఒక సంవత్సరంలో 101% రాబడిని ఇచ్చింది.


Kaiser Corporation:  
ఇక మరో మల్టీ బ్యాగర్ షేర్ గురించి కూడా తెలుసుకుందాం. కైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ (kaiser corporation share price) ఈ  కంపెనీ షేర్లు ఆరు నెలల్లో దాని పెట్టుబడిదారులకు 6000 శాతం పైగా బలమైన రాబడిని అందించాయి. ఈ రోజు కూడా కంపెనీ షేరు పెరుగుదల కొనసాగుతూ 4.99% లాభంతో రూ.75.70 వద్ద ముగిసింది.

6 నెలల క్రితం ధర 97 పైసలు
ఆరు నెలల క్రితం ఈ స్టాక్ ధర (kaiser corporation share price) బిఎస్‌ఇలో 95 పైసలు మాత్రమే. అది ఇప్పుడు రూ. 75 కి పెరిగింది. ఈ కాలంలో, ఈ స్టాక్ 6,142.27% రాబడిని ఇచ్చింది.

కైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ షేర్ ప్రైస్ చార్ట్ ప్యాటర్న్ ప్రకారం, ఆరు నెలల క్రితం ఒక ఇన్వెస్టర్ ఈ స్టాక్‌లో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఆ మొత్తం నేడు రూ.62.42 లక్షలకు పెరిగి ఉండేది. అదే సమయంలో, ఈ ఏడాది 2022లో ఈ కౌంటర్‌లో ఒక ఇన్వెస్టర్ రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే, అది ఇప్పటివరకు రూ.20.73 లక్షల లాభాన్ని ఆర్జించి ఉండేవాడు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మీలో ఈ మూడు విషయాలుంటే చాలు..! సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ కావచ్చు.. అంబానీ అవ్వొచ్చు
Aadhaar PAN Link : డిసెంబర్ 31 డెడ్‌లైన్.. ఆధార్, పాన్ లింక్ చేయకపోతే ఏం జరుగుతుంది?