ఈషా అంబానీ పెళ్లి.. ముహుర్తం ఖరారు

Published : Oct 31, 2018, 09:57 AM ISTUpdated : Oct 31, 2018, 10:00 AM IST
ఈషా అంబానీ పెళ్లి.. ముహుర్తం ఖరారు

సారాంశం

పెళ్లి వేడుక ఎక్కడ నిర్వహిస్తారనే విషయంపై ఊహాగానాలు వస్తున్న సమయంలో, ముంబయిలోని ముకేశ్‌ అంబానీ స్వగృహంలోనే ఈ వేడుక ఉండబోతోందని ఇరు కుటుంబ వర్గాలు ధ్రువీకరించాయి. 

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ కుమార్తె ఈషా అంబానీ పెళ్లికి ముహూర్తం ఖరారైంది. డిసెంబరు 12న ఆమె పెళ్లి అజయ్‌ పిరమాల్‌ కుమారుడు ఆనంద్‌ పిరమాల్‌తో జరగబోతోంది. పెళ్లి వేడుక ఎక్కడ నిర్వహిస్తారనే విషయంపై ఊహాగానాలు వస్తున్న సమయంలో, ముంబయిలోని ముకేశ్‌ అంబానీ స్వగృహంలోనే ఈ వేడుక ఉండబోతోందని ఇరు కుటుంబ వర్గాలు ధ్రువీకరించాయి. 

పెళ్లి తంతు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. వివాహ వేడుకకు ముందు వారాంతంలో అంబానీ, పిరమాల్‌ కుటుంబాలు, వారి స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఉదయ్‌పుర్‌లో ఘనంగా విందు ఏర్పాటు చేయబోతున్నారు. పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న ఈషా, ఆనంద్‌ల జంటకు ఆశీస్సులు అందజేయాలని కోరుతున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Gold : బంగారం పై అమెరికా దెబ్బ.. గోల్డ్, సిల్వర్ ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా?
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !