రూ. 1 లక్ష కోట్లతో ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ధాన్యాల నిల్వ చేసేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధం..కేబినేట్ నిర్ణయం

By Krishna Adithya  |  First Published May 31, 2023, 10:40 PM IST

ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ధాన్యాల నిల్వ కార్యక్రమం చేపట్టేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఒక లక్ష కోట్ల  రూపాయలతో గోడౌన్లను నిర్మించేందుకు కేంద్రం సిద్ధపడుతోంది. 


దేశంలో ధాన్యం నిల్వకు సంబంధించిన మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల దేశంలోని కష్టపడి పనిచేసే రైతుల శ్రమ వృధా అవుతుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో ఏటా దాదాపు 3,100 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతున్నాయి. కానీ ప్రస్తుత సామర్థ్యం ప్రకారం మొత్తం ఉత్పత్తిలో 47 శాతం మాత్రమే గోడౌన్లలో ఉంచవచ్చు. అయితే ఇప్పుడు త్వరలో ఈ పరిస్థితి మారనుంది. సహకార రంగంలో ఆహార ధాన్యాల నిల్వ సామర్థ్యాన్ని 700 లక్షల టన్నులకు పెంచేందుకు రూ.1 లక్ష కోట్ల ప్రణాళికకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది. 

కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం గురించి సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలియజేస్తూ, ప్రస్తుతం దేశంలో ఆహార ధాన్యాల నిల్వ సామర్థ్యం 1,450 లక్షల టన్నులు. వచ్చే ఐదేళ్లలో నిల్వ సామర్థ్యాన్ని 2,150 లక్షల టన్నులకు పెంచుతామని చెప్పారు. సహకార రంగంలో ఈ సామర్థ్యం పెరుగుతుంది. ప్రతిపాదిత పథకాన్ని సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ధాన్యాల నిల్వ కార్యక్రమంగా ఠాకూర్ అభివర్ణించారు. దీని కింద ఒక్కో బ్లాక్‌లో 2,000 టన్నుల సామర్థ్యంతో గోడౌన్లను నిర్మిస్తారు. 

आज की कैबिनेट बैठक में सहकारिता क्षेत्र में विश्व की सबसे बड़ी अन्न भंडारण योजना के अनुमति अनुमोदन पर आज निर्णय लिया गया है। अभी तक कुल 1450 लाख टन भंडारण की क्षमता है और अब 700 लाख टन भंडारण की क्षमता सहकारिता क्षेत्र में शुरू होगी।

-श्री pic.twitter.com/BrEG3o7h9G

— Office of Mr. Anurag Thakur (@Anurag_Office)

Latest Videos

నిల్వ సౌకర్యాల కొరతతో ధాన్యాన్ని నష్టపోకుండా కాపాడడం, ఆపద సమయంలో రైతులు తమ ఉత్పత్తులను త్రోసివేత ధరలకు విక్రయించకుండా నిరోధించడం, దిగుమతులపై ఆధారపడటం తగ్గించడం మరియు గ్రామాల్లో ఉపాధి అవకాశాలను కల్పించడం లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నట్లు ఆయన చెప్పారు. నిల్వ సామర్థ్యం పెరగడం వల్ల రైతులకు రవాణా ఖర్చు తగ్గుతుందని, ఆహార భద్రత పటిష్టం అవుతుందని మంత్రి అన్నారు. 

click me!