భారత్‌లో లేఆఫ్ బాంబు పేల్చిన మైక్రోసాఫ్ట్...Github సంస్థ నుంచి ఏకంగా 142 మంది ఉద్యోగులు ఔట్..

By Krishna AdithyaFirst Published Mar 29, 2023, 7:16 PM IST
Highlights


మైక్రోసాఫ్ట్ కంపెనీ అనుబంధ సంస్థ GitHub భారతదేశంలోని తన ఇంజనీరింగ్ బృందాన్ని మొత్తం లేఆఫ్ చేసి ఇంటి మార్గం చూపించింది. గతంలో మైక్రోసాఫ్ట్ 10,000 మంది ఉద్యోగులను తొలగించగా, GitHub 100 మందికి పైగా ఉద్యోగులను ఒక్క స్ట్రోక్ తో తొలగించింది. 

ప్రపంచంలోనే అగ్రగామి టెక్నాలజీ కంపెనీ మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగుల తొలగింపుల పర్వం కొనసాగుతోంది. మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని కంపెనీ గిట్‌హబ్ సంస్థ భారతదేశంలో పనిచేస్తున్న 142 మంది ఉద్యోగులకు ఒక్క దెబ్బతో తొలగించింది. తొలగించబడిన ఉద్యోగులందరూ GitHub ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. తాజా తొలగింపులు ఇందులో భాగమేనని భావిస్తున్నారు.

GitHub తీసుకున్న ఈ నిర్ణయం దేశంలోని మూడు నగరాల్లో పనిచేస్తున్న కంపెనీ ఉద్యోగులపై ప్రభావం చూపింది. తొలగించిన ఉద్యోగులు కంపెనీలోని బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ కార్యాలయాల్లో పనిచేస్తున్నారు. కంపెనీ లేఆఫ్ ప్రణాళికలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు GitHub ప్రతినిధి తెలిపారు. 

ఉద్యోగుల ఉపసంహరణపై స్పష్టతనిచ్చిన కంపెనీ.. దీర్ఘకాలిక వ్యూహంలో పెట్టుబడులు పెట్టే ప్రణాళికలో భాగంగానే కంపెనీని పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు సమాచారం తెలిపింది. మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని ఓపెన్ సోర్స్ డెవలపర్ ప్లాట్‌ఫారమ్ ఫిబ్రవరిలో కంపెనీ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 10 శాతం ఉద్యోగులను తొలగిస్తుందని ప్రకటించింది.

GitHubలో 3000 మంది పని చేస్తున్నారు 
GitHub అనేది ఓపెన్ సోర్స్ డెవలపర్ ప్లాట్‌ఫారమ్. ఈ ప్లాట్‌ఫారమ్‌లో దాదాపు ప్రపంచంలో దాదాపు 10 కోట్ల మంది డెవలపర్లు ఉన్నారు. GitHub భారత్ విభాగంలో దాదాపు 3,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. GitHub CEO థామస్ డోమ్కే ఉద్యోగులకు పంపిన ఇమెయిల్‌లో ప్రతి వ్యాపారానికి స్థిరమైన వృద్ధి అవసరమని అన్నారు. CEO తన మెయిల్ లో ఇలా వ్రాశారు, “ఈ రోజు, మేము 100 మిలియన్ల డెవలపర్‌లకు నిలయంగా ఉన్నాము మరియు మేము భవిష్యత్తులో డెవలపర్-ఫస్ట్ ఇంజనీరింగ్ సిస్టమ్‌గా మారబోతున్నాము. మేము మా కస్టమర్‌లు GitHubతో ఎదగడానికి, వృద్ధి చెందడానికి సహాయం చేస్తూనే ఉంటాము, వారి క్లౌడ్ అడాప్షన్ జర్నీని వేగవంతం, సులభతరం చేయడానికి ప్రతిరోజూ వారికి మద్దతునిస్తాము. అని తెలిపింది. 

ఓపెన్ సోర్స్ డెవలపర్ అంటే ఏంటి..
GitHub డెవలపర్‌లకు వారి కోడ్‌ను నిర్వహించడంలో సహాయపడుతుంది. ఇది క్లౌడ్ ఆధారిత సేవ. ఇది కాకుండా, డెవలపర్ తన కోడ్‌లో ఎలాంటి మార్పులు చేస్తున్నాడో ట్రాక్ రికార్డ్ కూడా GitHub లో కనిపిస్తుంది. దీని వల్ల డెవలపర్‌లు ఏదైనా సాఫ్ట్‌వేర్‌ను డెవలప్ చేయడం సులభం అవుతుంది. GitHub రెండు ప్రధాన సూత్రాలపై పనిచేస్తుంది. ఒకటి వెర్షన్ కంట్రోల్. మరొకటి Git. ఇందులో  Git అనేది ఓపెన్ సోర్స్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్. ప్రతి డెవలపర్ సిస్టమ్‌లో కోడ్‌బేస్ ఏదైనా ఉంటుందని దీని అర్థం. Gitని 2005లో లైనస్ టోర్వాల్డ్స్ రూపొందించారు. GitHub ఈ రెండు సూత్రాలను కలిపి డెవలపర్‌లకు సేవను అందిస్తుంది.

click me!