సంచలనం: మరోసారి సత్యనాదెళ్ల షేర్ల విక్రయం.. నోరు మెదపని మైక్రోసాఫ్ట్

By narsimha lodeFirst Published Aug 12, 2018, 11:00 AM IST
Highlights

ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల మరోసారి తన షేర్లను విక్రయించారు. 36 మిలియన్ల డాలర్ల విలువైన 3,28,000 షేర్లను విక్రయించినట్లు మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు.

వాషింగ్టన్‌: ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల మరోసారి తన షేర్లను విక్రయించారు. 36 మిలియన్ల డాలర్ల విలువైన 3,28,000 షేర్లను విక్రయించినట్లు మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. ఒక్కో షేర్ విలువ 109.08 డాలర్ల నుంచి 109.68 డాలర్లు వరకు అమ్మినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో మైక్రోసాఫ్ట్‌ తెలిపింది. తన వ్యక్తిగత ఆర్థిక కారణాలతోపాటు విస్తరణ దిశగా సత్య నాదెళ్ల తన షేర్లు అమ్ముకున్నారని సంస్థ ప్రతినిధి చెప్పారు.

సంస్థ విజయవంతానికి కట్టుబడి ఉన్న సత్యనాదెళ్ల

అయితే మైక్రోసాఫ్ట్ డైరెక్టర్లు నిర్దేశించిన అవసరాలకు అనుగుణంగా సంస్థ విజయవంతంగా ముందుకు సాగడానికి సత్యనాదెళ్ల కట్టుబడి ఉంటారని సంస్థ తెలిపింది. సత్య నాదెళ్ల విక్రయించిన షేర్లు 30 శాతం ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికి 2.2 మిలియన్ల విభిన్న రకాల షేర్లను సత్యనాదెళ్ల కలిగి ఉన్నారు. కాగా, నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే సత్యనాదెళ్ల తన షేర్లను విక్రయిస్తున్నారని బ్లూమ్ బర్గ్ నివేదించింది. 

మూడు రెట్లు పెరిగిన మైక్రోసాఫ్ట్ షేర్లు

మైక్రోసాఫ్ట్‌ సీఈవోగా స్టీవ్ బాల్మెర్ నుంచి 2014 ఫిబ్రవరిలో బాధ్యతలు  సత్య నాదెళ్ల విక్రయించిన తర్వాత సంస్థ షేర్ల విలువ మూడు రెట్లు పెరిగాయి. కాగా, సత్య నాదెళ్ల నాలుగేళ్లలో రెండోసారి అత్యధికంగా షేర్లు విక్రయించారు. ఆయన తన వాటాలోని షేర్లను విక్రయించడం ఇది రెండోసారి. రెండు సంవత్సరాల క్రితం 2016లో నాదెళ్ల 8.3 మిలియన్‌ డాలర్ల విలువైన 1,43,000 షేర్లను విక్రయించిన విషయం తెలిసిందే. స్టాక్‌ సేల్‌ నివేదిక ప్రకారం ఆయన దగ్గర ఇంకా 7,78,596 షేర్లు ఉన్నాయి. గతేడాది ఆయన 1.45మిలియన్‌ డాలర్లు వేతనంగా అందుకున్నారు.

ఇలా మైక్రోసాఫ్ట్ ఆల్ టైమ్ రికార్డులు

2014లో మైక్రోసాఫ్ట్ సీఈఓగా సంస్థ షేర్ ఉన్నత శిఖరాలకు దూసుకెళ్లడంతోపాటు ఆల్‌టైమ్ రికార్డులు నెలకొల్పింది. 835 బిలియన్ల డాలర్ల విలువ కలిగిన మైక్రోసాఫ్ట్.. మున్ముందు లక్ష కోట్ల డాలర్ల దిశగా దూసుకు వెళుతున్నది. తాజా పరిణామాలపై తక్షణం స్పందించడానికి మైక్రోసాఫ్ట్ అధికార ప్రతినిధి అందుబాటులోకి రాలేదు. 

శ్రావణ ‘పసిడి’ ధగధగలు

ఇటువైపు శ్రావణ మాసం మొదలవుతుండగానే మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర శనివారం పెరిగింది. స్థానిక ఆభరణాల తయారీదారుల దగ్గర నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో పసిడి ధర పుంజుకుంది. రూ.180 పెరగడంతో పది గ్రాముల బంగారం ధర రూ.30,700కి చేరింది. శ్రావణమాసం దగ్గరపడుతుండటంతో పాటు అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, ఆభరణాల తయారీదారుల దగ్గర నుంచి డిమాండ్‌ రావడంతో బంగారం ధర పెరిగినట్లు బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.

పసిడితోపాటే వెండి కూడా

బంగారం బాటలోనే వెండి పయనించింది. రూ.105 పెరగడంతో కిలో వెండి రూ.39వేల మార్క్‌ను చేరుకుంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి ఆశించిన మేర డిమాండ్‌ రావడంతో వెండి ధర పెరిగినట్లు ట్రేడర్లు అంటున్నారు. ఇదిలా ఉంటే అంతర్జాతీయంగా బంగారం ధర 0.07శాతం పడిపోయింది. దీంతో ఔన్సు 1,211.20 డాలర్లు పలికింది. దేశ రాజధానిలో 99.9శాతం 10గ్రాముల పసిడి రూ.30,700 పలకగా.. 99.5శాతం పసిడి రూ.30,550గా ఉంది.
 

click me!