LPG cylinder prices: తగ్గిన‌ ఎల్‌పీజీ సిలిండ‌ర్ ధ‌ర‌.. ఎంత తగ్గిందంటే..?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jun 01, 2022, 08:47 AM IST
LPG cylinder prices: తగ్గిన‌ ఎల్‌పీజీ సిలిండ‌ర్ ధ‌ర‌.. ఎంత తగ్గిందంటే..?

సారాంశం

కేంద్ర ఆయిల్ కంపెనీలు బుధవారం వాణిజ్య గ్యాస్ సిలిండర్ల (LPG cylinder) వినియోగదారులకు శుభవార్త తెలిపాయి. బుధవారం నుంచి 19 కిలోల కమర్సియల్ సిలిండర్ ధరను రూ.135లు తగ్గించింది.19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 2,219కు తగ్గింది.  

ఎల్పీజీ వినియోగదారులకు శుభవార్త. కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా తగ్గాయి. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 135 మేర తగ్గిస్తూ ఆయిల్ కంపెనీలు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నాయి. తగ్గించిన ధరలు నేటి నుంచే అమలులోకి రానున్నాయి. హైదరాబాద్‌లో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,220.50 అయింది. ఢిల్లీలో ఈ సిలిండర్ ధర రూ.2219కి దిగి రాగా, కోల్‌కతాలో రూ.2322, ముంబైలో రూ.2,171.50, చెన్నైలో రూ.2373కి లభ్యం కానుందని ఓ ప్రకటనలో తెలిపారు. గత నెలలో రూ.102.50 పెరగగా, తాజాగా కమర్షియల్ సిలిండర్ ధర దిగిరావడం ఊరటనిచ్చింది. గతంలో వంటగ్యాస్ ధరలు ఈ నెలలో రెండు సార్లు పెంచారు.ఈ సంవత్సరం అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నాయి. దీని ప్రభావం ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలపై కనిపించింది.మొత్తానికి వాణిజ్య వంటగ్యాస్ సిలిండర్ల ధరను తగ్గించడంతో వ్యాపారవర్గాల వారు ఊపిరిపీల్చుకున్నారు.

ఇంటి అవసరాల ఎల్పీజీ ధరలు

సామాన్యుడికి గ్యాస్ గుదిబండలా మారింది. గ్యాస్‌ సిలిండర్‌ ధర ఇటీవల పెరగడంతో మరో భారం సామాన్యుడి నెత్తినపడింది. తాజాగా domestic LPG cylinder Priceలో ఏ మార్పులు చేయలేదు. గృహావసరాలకు ఉపయోగించే 14.2 కిలోల గ్యాస్ సిలిండర్‌ ధర ఇటీవల ధరలు పెరిగాయి. గ్యాస్‌ బండ ధరను చమురు సంస్థలు రూ.3.50 పెంచాయి. అలాగే వాణిజ్య సిలిండర్‌ ధరపై రూ.8 పెంచాయి. ఇప్పటికే నిత్యావసరాలు, ఇంధన ధరల భారాన్ని మోస్తున్న సామాన్యులపై గ్యాస్ ధర పెరుగుదలతో మరింత భారం పడనుంది. 

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తుంటే, ఇప్పుడు వాటికి గ్యాస్ కూడా తోడైంది. ఇప్పటికే నిత్యావసరాల ధరలకు రెక్కలొచ్చి సామాన్యుడి జేబుకు చిల్లుపడింది. ధరలు పెరుగుతున్న తీరుతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వచ్చే కాస్త సంపాదన వీటికేపోతే బతుకు బండి ఎలా సాగుతున్నదని ఆవేదన చెందుతున్నారు. గతేడాది నుంచి ఇప్పటి వరకు గ్యాస్‌ సిలిండర్‌ మీద రూ.185 పెరిగింది. ప్రస్తుతం గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1100లకు చేరువలోకి వచ్చింది. ధరల నియంత్రణలో కేంద్ర విఫలమైందన్న విమర్శలు సైతం వస్తున్నాయి. గతేడాది జులై 2021లో గ్యాస్ ధర రూ.887 ఉండేది. ఇప్పుడు రూ.1,100కి చేరడంతో పేదలు గ్యాస్‌ కొనలేక ఇబ్బందులు పడుతున్నారు. కూలిపనులు చేసుకునే సామాన్యులు, చిరువ్యాపారుల జేబులు ఖాళీ అవుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: ట్రాఫిక్ క‌ష్టాల‌కు చెక్‌.. హైద‌రాబాద్‌లో మ‌రో ఫ్లై ఓవ‌ర్‌, 6 లైన్ ఎక్స్‌ప్రెస్ వే
Business Idea: మీ బిల్డింగ్‌పై ఖాళీ స్థ‌లం ఉందా.? మీరు ల‌క్షాధికారులు కావ‌డం ఖాయం