Gas Cylinder: సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : May 07, 2022, 08:55 AM ISTUpdated : May 07, 2022, 08:56 AM IST
Gas Cylinder: సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..!

సారాంశం

చమురు కంపెనీలు గృహ వినియోగ సిలిండర్ ధరను పెంచాయి. గ్యాస్ సిలిండర్ పై రూ.50 ధరను పెంచారు. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరతో ప్రస్తుతం ధర రూ.1052గా ఉంది. డీజిల్,పెట్రోల్ ధరల పెరుగుదలతో బాధపడుతున్న వినియోగదారులకు సిలిండర్ ధర పెరగడంతో పెద్ద షాక్ తగిలినట్టైంది.

వినియోగదారుల‌కు చమురు కంపెనీలు భారీ షాక్ ఇచ్చాయి. ఇంటి వినియోగ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర ఏకంగా రూ. 50 పెంచాయి. తాజాగా పెరిగిన ధ‌ర‌తో గ్యాస్ సిలిండర్ ధర రూ. 1052కు చేరింది. పెరిగిన ధ‌ర‌లు ఇప్ప‌టికే అమ‌ల్లోకి వ‌చ్చాయి. పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌తో ఇప్ప‌టికే ఇబ్బంది ప‌డుతున్న ప్ర‌జ‌ల‌కు.. పెరిగిన గ్యాస్ సిలిండర్ మ‌రింత భారం కానుంది.  

రోజు రోజుకి గ్యాస్ సిలిండర్ ధరలు బాగా పెరిగిపోతున్నాయి. మనం ఈ సంవత్సరం జనవరి నుండి చూసుకున్నట్టయితే గ్యాస్ సిలిండర్ ధర మొత్తం రూ.200 పైగా పెరిగింది.  అయితే.. తాజాగా వినియోగదారులకు చమురు కంపెనీలు మరోసారి దిమ్మదిరిగే షాక్ ఇచ్చాయి. ఈ నెల ప్రారంభంలో.. వాణిజ్య LPG సిలిండర్ల ధరలను చమురు కంపెనీలు పెంచాయి. మే 1న 19 కిలోల కమర్షియల్ ఎల్‌పిజి సిలిండర్ ధర రూ. 102.50 పెరిగి, రూ.2355.50కి, అంతకుముందు రూ.2253కి పెరిగింది. అలాగే 5 కిలోల ఎల్‌పిజి కమర్షియల్ సిలిండర్ ధరను రూ.655కి పెంచిన విష‌యం తెలిసిందే. గతంలో 19 కిలోల కమర్షియల్ ఎల్‌పిజి సిలిండర్‌కు రూ. 250 పెంచి ఏప్రిల్ 1న రూ. 2,253కి పెంచారు. ఇంకా మార్చి 1, 2022న కమర్షియల్ ఎల్‌పిజి ధర రూ.105 పెరిగిన విష‌యం తెలిసిందే. 

ఈ నెల 1న కమర్షియల్‌ సిలిండర్‌ ధరలు పెంచిన ప్రభుత్వం.. ఈసారి గృహావసరాలకు వినియోగించే గ్యాస్‌ (domestic cooking gas ) సిలిండర్‌పై వడ్డించింది. 14 కేజీల సిలిండర్‌పై రూ.50 పెంచుతూ దేశీయ ఇంధన కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1052కు చేరింది. దీనికి డెలివరీ బాయ్స్ తీసుకునే రూ.30 కలిపితే రూ.1082 అవుతుంది. పెంచిన ధరలు నేటినుంచే అమల్లోకి వస్తాయని ప్రకటించాయి. గృహావసరాలకు వినియోగించే సిలిండర్‌ ధరను మార్చి 22న పెంచిన విషయం తెలిసిందే. ఈ నెల 1న కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరను భారీగా పెంచిన విషయం తెలిసిందే. 19 కిలోల సిలిండర్‌పై ఒకేసారి రూ.250 వడ్డించాయి. దీంతో సిలిండర్‌ ధర రూ.2460కు పెరిగింది. వారం రోజుల వ్యవధిలోనే గ్యాస్‌ సిలిండర్‌ ధరలు భారీగా పెరగడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Gold Jewellery: బంగారు ఆభరణాలు అద్దెకు ఇస్తే నెలలో లక్షల రూపాయలు సంపాదించే ఛాన్స్
Govt Employees Arrears: త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు లక్షల్లో చేతికి అందనున్న ఎరియర్స్