LIC Listing: గంట మోగింది...ఇన్వెస్టర్ల ఆశలకు చిల్లు పడింది...ఎల్ఐసీ నష్టాల లిస్టింగ్ కు కారణం ఇదే..

By team teluguFirst Published May 17, 2022, 10:49 AM IST
Highlights

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC Listing) షేర్ల లిస్టింగ్ జరిగింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఎల్ఐసీ షేర్ల లిస్టింగ్‌ (Life Insurance Corporation listing) ఇష్యూ ధర కన్నా 9 శాతం డిస్కౌంట్ తో లిస్ట్ అయ్యింది. దీంతో షేర్లు అలాట్ అయిన ఇన్వెస్టర్ల ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. మదుపరులు లిస్టింగ్ లాభాలను పొందలేకపోయారు. 

ఎల్‌ఐసీ షేర్లు మంగళవారం స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ అయ్యాయి. ఈ షేరు బిఎస్‌ఇలో రూ.867 వద్ద లిస్ట్ అవగా, ఎన్‌ఎస్‌ఇలో రూ. 872 వద్ద లిస్ట్ అయింది. ఇష్యూ ధర కంటే దాదాపు 8 శాతం దిగువన లిస్టింగ్ అవడంతో ఇన్వెస్టర్లను నిరాశపరిచింది. అయితే, 10 నిమిషాల్లో ఈ స్టాక్ రెండు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో రూ.900కి చేరుకుంది. సుమారు 10:10 సమయానికి, ఈ స్టాక్ ధర రెండు స్టాక్ ఎక్స్ఛేంజీలలో దాదాపు రూ. 900 నడుస్తోంది. దీంతో ఇన్వెస్టర్లకు ఆశ కలిగింది. కానీ ఇప్పటికీ ఇష్యూ ధరను తాకలేదు. ఈ స్టాక్ ప్రీ మార్కెట్ ట్రేడింగ్ లో రూ.860 కనిష్ట స్థాయిని చూపింది.

LIC Issue దేశంలోనే అతిపెద్ద IPO కావడంతో  చాలా చర్చనీయాంశమైంది. గ్రే మార్కెట్‌లో ఎల్‌ఐసీ షేర్లు తగ్గింపుతో ట్రేడయినప్పటి నుంచి ఇన్వెస్టర్లకు ప్రారంభ లాభాలు రావని నిపుణులు చెబుతూ వచ్చారు. దీంతో బలహీనమైన లిస్టింగ్ అవుతుందని ఇన్వెస్టర్లు ఆందోళన చెందారు. చివరికి ఇది ఇష్యూ ధర కంటే తక్కువకే లిస్ట్ అయ్యింది.  గ్రే మార్కెట్‌లో ఈ స్టాక్ ధరల ట్రెండ్‌ను పరిశీలిస్తే, నిపుణులు బలహీనమైన లిస్టింగ్‌ను ముందే అంచనా వేశారు. ఒక్కో షేరు ఇష్యూ ధర రూ. 949 ఉండగా, ఎల్‌ఐసి షేరు ఎన్‌ఎస్‌ఇలో రూ.872 వద్ద స్థిరపడింది. అదే సమయంలో, ఎల్‌ఐసి షేరు బిఎస్‌ఇలో ఒక్కో షేరుకు రూ.867 వద్ద స్థిరపడినట్లు కనిపిస్తోంది. లిస్టింగ్ సమయంలో 9 శాతం తగ్గింపును సూచించింది. ప్రీ-ఓపెన్‌లో ఎల్‌ఐసీ మార్కెట్ క్యాప్ రూ.5.5 లక్షల కోట్లను దాటింది.

Shri Mangalam Ramasubramanian Kumar, Chairperson, and Shri Tuhin Kanta Pandey, Secretary along with Shri , MD&CEO, and others ringing the opening bell to mark the Listing of Life Insurance Corporation of India on 17th May, 2022 pic.twitter.com/wWNYVbaCIm

— BSE India (@BSEIndia)


ఎల్‌ఐసీలో తన 3.5 శాతం వాటాను విక్రయించడం ద్వారా ప్రభుత్వం దాదాపు రూ.21,000 కోట్లు సంపాదించింది. ఈ ఐపీఓ ద్వారా ఎల్‌ఐసీలో తన 5 శాతం వాటాను విక్రయించడం ద్వారా రూ.60,000 కోట్లను సమీకరించాలని గతంలో ప్రభుత్వం భావించింది. అయితే, పేలవమైన మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా, ఇది IPO పరిమాణాన్ని తగ్గించింది. ఎల్‌ఐసీ వేల్యూయేషన్ కూడా తగ్గించారు.

రిటైల్ ఇన్వెస్టర్లకు ఎల్‌ఐసీ ఒక్కో షేరుపై రూ.45 డిస్కౌంట్ ప్రకటించింది. పాలసీదారులకు ఒక్కో షేరుపై రూ.60 తగ్గింపును అందించారు. డిస్కౌంట్ తర్వాత, కంపెనీ పాలసీదారులకు ఒక్కో షేరుకు రూ.889 చొప్పున, రిటైల్ ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుకు రూ.904 చొప్పున షేర్లను జారీ చేసింది.

ఇదిలా ఉంటే మార్కెట్‌లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఎల్‌ఐసీ ఐపీఓ విజయవంతమైందని నిపుణులు చెబుతున్నారు. పాలసీదారులు, ఉద్యోగులు, రిటైల్ ఇన్వెస్టర్లు ఇష్యూపై మంచి ఆసక్తిని కనబరిచారు. దీనికి కారణం ఎల్‌ఐసీ బలమైన బ్రాండ్. ఇది ప్రతి ఇంటిలో గుర్తింపు పొందింది. చాలా మంది బీమా అంటే ఎల్‌ఐసీలోనే తీసుకుంటారు. ఇది దేశవ్యాప్తంగా విస్తృత విక్రయ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. దీనికి దేశవ్యాప్తంగా 2000 కంటే ఎక్కువ శాఖలు ఉన్నాయి.

బలహీనమైన లిస్టింగ్ కారణంగా రిటైల్ ఇన్వెస్టర్లు భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. వారు ఈ స్టాక్‌ను నష్టానికి విక్రయించకుండా ఉండాలని. ఈ స్టాక్‌పై నమ్మకం ఉంచమని చెబుతున్నారు. మీడియం నుండి దీర్ఘకాలంలో, ఈ స్టాక్ పెట్టుబడిదారులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

కారణం ఇదే...
గ్లోబల్ మార్కెట్ల అమ్మకాల ప్రభావం దేశీయ మార్కెట్లపై కనిపిస్తోంది. అదే సమయంలో భారత మార్కెట్లో పెద్దగా ఊపందుకోవడం లేదు. ఇది కాకుండా, గ్రే మార్కెట్‌లో ఎల్‌ఐసి షేర్ల ప్రీమియం కూడా ప్రతికూలంగా మారింది, కాబట్టి ఎల్‌ఐసి షేర్ల లిస్టింగ్ ఇష్యూ ధర రూ. 949 కంటే తక్కువగా ఉండవచ్చని నిపుణులు అంచనా వేశారు. చాలా మంది నిపుణులు స్టాక్‌పై మొదటి నుంచి బుల్లిష్ గా లేరు. 

click me!