
గత వారం చివరి ట్రేడింగ్ రోజైన శుక్రవారం, ఎల్‌ఐసి స్టాక్ రూ. 800.05 స్థాయికి పడిపోయింది. తాజాగా సోమవారం ఎల్‌ఐసి స్టాక్ సరికొత్త కొత్త లైఫ్‌టైమ్ కనిష్ట స్థాయి రూ. 780.05 తాకింది. మార్కెట్‌లో లిస్టింగ్ అయిన రెండు వారాల్లోనే ఎల్‌ఐసీ షేరు ధర 7.72 శాతం అంటే రూ.67 పడిపోయింది. దీంతో ఎల్‌ఐసీ మార్కెట్ క్యాప్ రూ.5,06,126 కోట్లకు పడిపోయింది. IPO ఇష్యూ ధర ఎగువ బ్యాండ్ ప్రకారం, LIC విలువ రూ.6,00,242 కోట్లు. అంటే ఇప్పటి వరకు దాని ఐపీఓలో డబ్బు పెట్టిన ఇన్వెస్టర్లలో రూ.94,116 కోట్లు మునిగిపోయాయి.
ఎల్‌ఐసీ స్టాక్ ఇప్పటివరకు ఎంత పతనమైంది
LIC IPO కోసం ప్రైస్ బ్యాండ్ రూ. 902-949 నిర్ణయించగా. మొదటి రోజు, LIC స్టాక్ 13 శాతం వరకు పడిపోయింది. చివరకు 8.62 శాతం అంటే రూ. 81.80 తగ్గి రూ. 867.20 వద్ద స్థిరపడింది. ప్రస్తుతం, ఇష్యూ ధరతో పోలిస్తే ఇది 15 శాతానికి పైగా పడిపోయింది.
బ్రోకరేజ్ సంస్థ ఔట్ లుక్ ఇదే..
బ్రోకరేజ్ సంస్థ ఎమ్కే గ్లోబల్ LIC కవరేజీని ప్రారంభించింది. సంస్థ ఎల్‌ఐసికి హోల్డ్ రేటింగ్‌తో టార్గెట్ ధర రూ. 875 ఇచ్చింది. ఎంకే గ్లోబల్ అంచనా సరైనదని తేలితే, ఎల్‌ఐసీ ఐపీఓలో దీర్ఘ కాలం ఔట్ లుక్ తో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లు ఇక నష్టాల నుంచి కోలుకోలేరని అర్థం. ఎల్‌ఐసీని డ్యాన్స్ చేయలేని ఏనుగు అని బ్రోకరేజీ సంస్థ పేర్కొంది.
ఎల్‌ఐసీ ప్రస్తుతం రూ. 42 లక్షల కోట్ల ఆస్తులను నిర్వహిస్తోందని, దేశంలోనే అతిపెద్ద అసెట్ మేనేజర్ అని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాజ్ కుమార్ తెలిపారు. ఇది కాకుండా, దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఎల్‌ఐసి అతిపెద్ద పెట్టుబడిదారు. కంపెనీ ఆస్తుల్లో దాదాపు 25 శాతాన్ని స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది.
మార్కెట్ క్యాప్ పరంగా 5వ స్థానం నుంచి 7వ స్థానానికి పడిపోయిన ఎల్ఐసీ