
చాలా రుణ సంస్థలు మీ CIBIL స్కోర్‌తో పాటు మీ ప్రస్తుత జీతం లేదా ఆదాయం లాంటి ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని రుణాలను అందిస్తాయి. మీకు తక్కువ క్రెడిట్ రేటింగ్ ఉన్నట్లయితే మీ జీతం, వార్షిక బోనస్ లేదా ఇతర అదనపు ఆదాయ వనరులను రుజువుగా చూపిస్తూ బ్యాంక్ స్టేట్‌మెంట్ జత చేసి రుణం పొందవచ్చు. మీరు సకాలంలో రుణాన్ని తిరిగి చెల్లించగల ఆర్థిక సామర్థ్యం కలిగి ఉన్నారని బ్యాంకు భావిస్తే రుణం అందిస్తుంది.
NBFC నుండి లోన్ పొందవచ్చు..
మీ CIBIL స్కోర్ తక్కువగా ఉన్నప్పటికీ, మీకు అత్యవసరంగా డబ్బు అవసరమైతే, NBFC నుండి లోన్ కోసం దరఖాస్తు చేసుకోవడం మంచిది. ఎందుకంటే వారు తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న కస్టమర్లకు కూడా రుణాలు ఇస్తారు. అయితే, బ్యాంకులు అందించే వడ్డీ రేట్లు కంటే NBFCలు వసూలు చేసే వడ్డీ రేట్లు కొద్దిగా ఎక్కువగా ఉంటాయి.
తక్కువ మొత్తం రుణానికి దరఖాస్తు చేసుకోండి
పేలవమైన CIBIL కారణంగా, మీ రుణం రిజెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో మీ లోన్ మొత్తం తక్కువగా ఉంటే మీకు బ్యాంకులు రుణం అందించే వీలుంది.
జాయింట్ రుణం తీసుకోవచ్చు
మీరు CIBIL స్కోర్ తక్కువగా ఉన్న కారణంగా రుణాన్ని పొందలేకపోతే, మీరు జాయింట్ రుణాన్ని తీసుకోవచ్చు. ఇది కాకుండా, మీరు మంచి CIBIL స్కోర్ ఉన్న గ్యారంటీర్ ద్వారా కూడా లోన్ తీసుకోవచ్చు. ఈ పద్ధతిలో మీకు సులభంగా రుణం లభిస్తుంది.
బంగారు రుణం
గోల్డ్ లోన్ అనేది ఒక రకమైన సెక్యూర్డ్ లోన్. ఇందులో మీరు మీ బంగారాన్ని తాకట్టుగా ఉంచి రుణం పొందవచ్చు. ఈ రుణం కోసం బ్యాంకులు మీ క్రెడిట్ స్కోర్‌ను కూడా తనిఖీ చేయవు. ఇందులో, మీరు మీ బంగారం ప్రస్తుత విలువలో 75 శాతం వరకు రుణం పొందవచ్చు.
ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై పర్సనల్ లోన్ తీసుకోండి
మీరు పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటే, బ్యాంకు లేదా పోస్టాఫీసు FD కూడా సహాయపడుతుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ ద్వారా కూడా సులభంగా లోన్ తీసుకోవచ్చు.
బీమా పాలసీలు కూడా రుణాలను అందించగలవు
మీరు ఇన్సూరెన్స్ పాలసీని తీసుకున్నట్లయితే, మీరు దానిపై కూడా రుణం కూడా తీసుకోవచ్చు. వ్యక్తిగత రుణాలతో పోలిస్తే దీని వడ్డీ రేట్లు తక్కువ. ఈ రకమైన రుణంలో, బీమా పాలసీని బ్యాంకు పేరు మీదకు మార్చాలి. మీరు రుణాన్ని తిరిగి చెల్లిస్తే, బ్యాంక్ పాలసీని మీ పేరుకు మార్చుకోవచ్చు.
బ్యాంకుల తప్పు వల్ల కూడా మీ CIBIL స్కోర్ ఒక్కోసారి తరిగిపోతుంది. దీన్ని నివారించడానికి, ప్రతి 6 నెలలకు ఒకసారి మీ CIBIL స్కోర్‌ను తనిఖీ చేస్తూ ఉండటం ముఖ్యం.