అయ్యో పాపం...మూడో రోజు మరింత నష్టాల్లో LIC Share, ఒక్కో షేరుపై ఇష్యూ ధర కన్నా ఏకంగా రూ.100 నష్టం...

By team teluguFirst Published May 19, 2022, 4:12 PM IST
Highlights

LIC IPO సమయంలో తమకు కనీసం ఒక్క లాట్ షేర్లు అయినా అలాట్ అయితే చాలు అని చాలా మంది ఇన్వెస్టర్లు ఎదురు చూశారు. ఎందుకంటే అంతా బంపర్ లిస్టింగ్ అవుతుందని కలలు కన్నారు. కానీ షేర్లు అలాట్ కాని వారు ఇఫ్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు.  ఎందుకంటే ప్రస్తుతం LIC ఇష్యూ ధర కన్నా రూ.100 నష్టంతో ట్రేడవుతోంది. 

వరుసగా మూడో రోజు, ఎల్‌ఐసి షేర్లు పతనాన్ని కొనసాగిస్తున్నాయి.  మూడవ రోజు కూడా, LIC షేరు ఇష్యూ ధరను తాకలేదు. మూడో రోజు LIC Share ఒక్కోటి  4.13 శాతం నష్టపోయి 840.20  వద్ద ముగిసింది. . LIC IPOలో ఇష్యూ ధర రూ. 949గా నిర్ణయించగా, ఈ మూడు రోజుల్లో, LIC స్టాక్ దాని ఇష్యూ ధరను ఒక్కసారి కూడా తాకలేదు.

ఈ మూడు రోజుల్లో ఎల్‌ఐసీ మార్కెట్ క్యాప్ కూడా తగ్గి రూ.5.54 లక్షల కోట్ల నుంచి రూ.5.35 లక్షల కోట్లకు తగ్గింది. కంపెనీ తన IPO నుండి 20,557 కోట్ల రూపాయలను సమీకరించింది. అయితే, దాని షేర్లు స్టాక్ మార్కెట్‌లో జాబితా చేయబడ్డాయి, ఇష్యూ ధర రూ. 949తో పోలిస్తే ఎనిమిది శాతానికి పైగా పడిపోయాయి.

ఎల్‌ఐసీ షేరు గరిష్ఠ స్థాయిని పరిశీలిస్తే, ఈ మూడు రోజుల్లో రూ.918.95కు చేరుకోగలిగింది, కనిష్ట స్థాయిని చూస్తే ఒక్కో షేరుపై రూ.843.25 కనిష్ట స్థాయికి చేరుకుంది. నేడు కనిష్ట స్థాయికి చేరువలో ట్రేడవుతుండడంతో మరింత దిగజారుతుందన్న భయం ఇన్వెస్టర్లను వెంటాడుతోంది.

44 వేల కోట్ల మార్కెట్ క్యాప్ పతనం
LIC IPO కోసం లిస్టింగ్ ఎగువ ధరను రూ. 949 వద్ద ఉంచింది.   IPO సమయంలో దీని మార్కెట్ క్యాప్ రూ.6.01 లక్షల కోట్లు. అయితే, ఈరోజు ట్రేడింగ్‌లో మూడో రోజు ఎల్‌ఐసీ మార్కెట్ క్యాప్ రూ.881 వద్ద 5,57,864.80 కోట్లుగా ఉంది. అంటే ఇష్యూ ధర నుంచి ఇప్పటి వరకు షేరు పతనం కావడంతో కంపెనీ మార్కెట్ క్యాప్ దాదాపు రూ.44 వేల కోట్లు తగ్గింది. 

3 రోజుల్లో స్టాక్ ఎలా కదిలింది?
ఎల్‌ఐసి స్టాక్ మే 17న ఇష్యూ ధర రూ.949కి వ్యతిరేకంగా రూ.867 వద్ద లిస్ట్ అయ్యింది. ఇంట్రాడేలో రూ.920 వరకు బలపడి రూ.875 వద్ద ముగిసింది. రెండో రూ.9 పెరుగుదలతో రూ.886 వద్ద ప్రారంభమై రూ.890కి చేరింది. కానీ తర్వాత అది తగ్గుముఖం పట్టి రూ.877కి తగ్గింది. ఇక మూడో రోజు అయితే 4.13 శాతం నష్టపోయి 840.20  వద్ద ముగిసింది. 

LIC యొక్క IPO పెట్టుబడిదారుల నుండి మంచి స్పందనను పొందింది. ఈ ఇష్యూ 2.95 సార్లు అంటే దాదాపు 295 శాతం ఓవర్ స్క్రయిబ్ అయ్యింది. రిజర్వ్ పోర్షన్‌కు ఉద్యోగులు మరియు పాలసీదారులకు మంచి స్పందన లభించింది. ఉద్యోగుల రిజర్వ్ కోటా దాదాపు 4.40 రెట్లు, పాలసీదారుల రిజర్వ్ కోటాకు 6.11 రెట్లు బిడ్లు వచ్చాయి. QIB యొక్క వాటా 2.83 రెట్లు, NII యొక్క వాటా 2.91 రెట్లు  రిటైల్ పెట్టుబడిదారుల కోసం రిజర్వ్ కోటా 1.99 రెట్లు ఓవర్ సబస్క్రయిబ్ అయ్యింది. LIC షేర్ల లిస్టింగ్ మే 17న అంటే ఈ మంగళవారం జరిగింది. అయినప్పటికీ, బ్యాంగ్ లిస్టింగ్ కోసం ఆశించిన పెట్టుబడిదారులు నిరాశ చెందారు. ఇది ఇష్యూ ధర కంటే దిగువన లిస్ట్ అయ్యింది. 

ఇదిలా ఉంటే LIC దేశంలోనే అతిపెద్ద బీమా కంపెనీ. ప్రీమియం (లేదా GWP) పరంగా కంపెనీ మార్కెట్ వాటా 61.6 శాతం. అదే సమయంలో, డిసెంబర్ 31, 2021 వరకు జారీ చేయబడిన వ్యక్తిగత పాలసీల విషయంలో, మార్కెట్ వాటా దాదాపు 71.8 శాతం. LIC నిర్వహణలో ఉన్న ఆస్తి 40.1 లక్షల కోట్లు. FY21లో కంపెనీ వార్షిక ప్రీమియం 4 లక్షల కోట్లు. జీవిత బీమాతో పాటు, కంపెనీ సేవింగ్స్, టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, యులిప్, యాన్యుటీ, పెన్షన్ ఉత్పత్తులను కలిగి ఉంది.
 

click me!