LIC results: ఎల్ఐసీ ప్రీమియం ఆదాయం తగ్గడంతో లాభం దెబ్బతిన్నట్లు సమాచారం. అలాగే, తక్కువ మొత్తాన్ని వాటాదారుల నిధికి బదిలీ చేసిందని రాయిటర్స్ నివేదించింది. ఫైనాన్షియల్ రిపోర్ట్‌కు ముందు ఎల్‌ఐసీ షేర్లు 0.7% నష్టపోయి రూ.610.25 వద్ద ముగిశాయి.
LIC Q2 results: ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 50 శాతం క్షీణించి రూ.7,925 కోట్లకు పరిమితమైంది. గత ఏడాది ఇదే కాలంలో రూ.15,952 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు ఎల్ఐసీ రెగ్యులేటరీ ఫైలింగ్ లో తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నికర ప్రీమియం ఆదాయం రూ.1,32,631.72 కోట్ల నుంచి రూ.1,07,397 కోట్లకు తగ్గింది. అయితే ఈ త్రైమాసికంలో మొదటి ఏడాది ప్రీమియం రూ.9,125 కోట్ల నుంచి రూ.9,988 కోట్లకు పెరిగింది. తాజా సెప్టెంబర్ త్రైమాసికంలో ఎల్ఐసీ మొత్తం ఆదాయం రూ.2,22,215 కోట్ల నుంచి రూ.2,01,587 కోట్లకు తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో పెట్టుబడుల ద్వారా వచ్చిన నికర ఆదాయం రూ.84,104 కోట్ల నుంచి రూ.93,942 కోట్లకు పెరిగింది.
ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో ఎల్ఐసీ సాల్వెన్సీ మార్జిన్ 1.88 శాతం నుంచి 1.90 శాతానికి పెరిగింది. అసెట్ క్వాలిటీ విషయానికొస్తే స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 5.60 శాతం నుంచి 2.43 శాతానికి తగ్గింది. సెప్టెంబర్ తో ముగిసిన ఆరు నెలల కాలంలో ఎల్ ఐసీ అత్యధికంగా రూ.17,469 కోట్ల పన్ను అనంతర లాభాన్ని ఆర్జించింది. తొలి అర్ధభాగంలో కొత్త బిజినెస్ ప్రీమియం ఆదాయం రూ.24,535 కోట్ల నుంచి స్వల్పంగా పెరిగి రూ.25,184 కోట్లకు చేరింది. మొత్తం ప్రీమియం కూడా రూ.1,27,738 కోట్ల నుంచి స్వల్పంగా పెరిగి రూ.1,34,783 కోట్లకు చేరింది. "ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో, మా మొత్తం వ్యక్తిగత వ్యాపారంలో నాన్-పార్ ఉత్పత్తుల వాటాను పెంచడానికి మేము వ్యూహాలను విజయవంతంగా అమలు చేయగలిగాము. ప్రస్తుత వీఎన్బీ (కొత్త వ్యాపారం విలువ) మార్జిన్లు దిశను మారుస్తున్నప్పుడు లాభదాయకతను కొనసాగించే లక్ష్యాన్ని అందించే మా కార్యక్రమాలకు సూచిక" అని ఎల్ఐసీ చైర్మన్ సిద్ధార్థ మొహంతి అన్నారు.
ఎల్ఐసీ వ్యాపారంలోని కొన్ని విభాగాల్లో మార్కెట్ డైనమిక్స్ ను తెలుసుకునీ, లాభాల ఆధారిత కన్సాలిడేషన్ దిశగా పనిచేస్తోందని తెలిపారు. బంకాస్ ఇన్సూరెన్స్, ఆల్టర్నేటివ్ ఛానల్స్ వాటా పెరగడంతో డిస్ట్రిబ్యూషన్ మిక్స్ కూడా మరింత వైవిధ్యంగా ఉంటుందనీ, ఈ ఒప్పందం కోసం మరో రెండు బ్యాంకులతో ఎల్ఐసీ సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు. ఇటీవల ఎల్ఐసీ తీసుకున్న కార్యక్రమాల పరంగా దిశామార్పు వచ్చిందని తెలిపారు. కాగా, ఎల్ఐసీ ప్రీమియం ఆదాయం తగ్గడంతో లాభం దెబ్బతిన్నట్లు సమాచారం. అలాగే, తక్కువ మొత్తాన్ని వాటాదారుల నిధికి బదిలీ చేసిందని రాయిటర్స్ నివేదించింది. దాని నికర ఆదాయంలో పతనం 18 శాతం.