అమెజాన్‌లో లేఆఫ్‌లు: ఇండియాలో వెయ్యి మంది ఉద్యోగులతో సహా 18వేల మంది ఔట్.. 5 నెలల అడ్వాన్స్ జీతం..

By asianet news teluguFirst Published Jan 13, 2023, 10:17 AM IST
Highlights

గతంలో కూడా అమెజాన్ కంపెనీ ఇండియాలో 1000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించవచ్చని  కొన్ని నివేదికలు సూచించాయి. గత వారం, కంపెనీ సీఈఓ ఆండీ జాస్సీ తన బ్లాగ్‌లో జనవరి 18 తర్వాత ఉద్యోగుల తొలగింపుల వల్ల ప్రభావితమైన ఉద్యోగులతో కమ్యూనికేట్ చేస్తామని చెప్పారు.

ఈ కామర్స్, ఐటీ దిగ్గజం అమెజాన్‌లో ఉద్యోగుల తొలగింపు ప్రారంభమైంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో ఆండీ జాస్సీ స్వయంగా ధృవీకరించారు. తొలగింపులు ప్రారంభమవుతున్నాయని, కంపెనీకి చెందిన 18000 మందికి పైగా ఉద్యోగులు దీని వల్ల ప్రభావితమవుతారని, ఇందులో భారతదేశంలోని వేలాది మంది ఉద్యోగులు కూడా ఉన్నారని ఆయన చెప్పారు. 

గతంలో కూడా అమెజాన్ కంపెనీ ఇండియాలో 1000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించవచ్చని  కొన్ని నివేదికలు సూచించాయి. గత వారం, కంపెనీ సీఈఓ ఆండీ జాస్సీ తన బ్లాగ్‌లో జనవరి 18 తర్వాత ఉద్యోగుల తొలగింపుల వల్ల ప్రభావితమైన ఉద్యోగులతో కమ్యూనికేట్ చేస్తామని చెప్పారు.

గురుగ్రామ్-బెంగళూరు కార్యాలయాల్లో
మీడియా నివేదికల ప్రకారం, భారతదేశంలోని గురుగ్రామ్, బెంగళూరు అమెజాన్ ఇతర కార్యాలయాలలో ఇప్పటికే తొలగింపులు ప్రారంభమైంది.  కంపెనీ నుండి తొలగించబడిన ఉద్యోగులలో ఫ్రెషర్లు ఇంకా ఎక్స్పీరియన్స్ ఉన్నవారు కూడా ఉన్నారు. 

ఐదు నెలల జీతం 
నివేదికల ప్రకారం, తొలగించబడిన ఉద్యోగులకు అమెజాన్ ఐదు నెలల అడ్వాన్స్ జీతం అందజేస్తున్నట్లు ఇమెయిల్ పంపింది. ఉద్యోగులు నిర్ధిష్ట తేదీలో టీం హెడ్ ని కలవాలని కోరారు. అమెజాన్‌లో తొలగింపులు రాబోయే వారాల పాటు కొనసాగుతాయని భావిస్తున్నారు. 

 అతిపెద్ద తొలగింపు
 ప్రస్తుత మాంద్యంలో 18,000 మంది ఉద్యోగులను తొలగించిన అమెజాన్లో  ఇప్పటివరకు ఉన్న అతిపెద్ద తొలగింపు అవుతుంది. లేఆఫ్‌లు అంటే తాజా  ఉద్యోగుల కోతలు వర్క్ ఫోర్స్ లో దాదాపు ఒక శాతం మాత్రమే. కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 350,000 మంది కార్పొరేట్ ఉద్యోగులు ఉన్నారు.

ట్రాకింగ్ సైట్ Layoff.FYI ప్రకారం గత ఏడాది టెక్ పరిశ్రమలో 1.5 లక్షల ఉద్యోగాల కోత జరిగింది. కొత్త సంవత్సరంలో కూడా రిట్రెంచ్‌మెంట్ దశ కొనసాగుతుంది. 

ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా నవంబర్‌లో 11,000 మంది ఉద్యోగులను తొలగించింది.
స్నాప్‌చాట్ ఆగస్టులో 1,200 మందిని తొలగించింది. 
అక్టోబర్‌లో ట్విట్టర్ 7,500 మందిని తొలగించింది.
క్రంచ్‌బేస్ లెక్క ప్రకారం, USలోని టెక్ కంపెనీలు 2022లో 9,1000 తొలగింపులు చేశాయి.

టెక్ కంపెనీలలో కలకలం 
ప్రపంచ ఆర్థిక మాంద్యం భయం మధ్య, ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలలో ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. Twitter, Meta, Amazon, HP Inc కాకుండా దాదాపు మరో 6,000 మంది ఉద్యోగాల  తొలగింపు ఉండవచ్చు. తాజాగా పెప్సికో కూడా కోతలను ప్రకటించింది. 

ఒక నివేదిక ప్రకారం ఈ కంపెనీలు కూడా  ఉద్యోగాల కొత విధించవచ్చు
సేల్స్‌ఫోర్స్ 8,000 మందిని 
HP 6,000 మందిని 
సిస్కో 5 శాతం మందిని 
చిమ్ 160 మందిని 
కాయిన్‌బేస్ 60 మందిని 
Vimeo 11 శాతం మందిని 
స్ట్రిప్ 14 శాతం మందిని 
క్రాకెన్ 30 శాతం మందిని తగ్గించాలని కూడా ప్లాన్ చేస్తున్నాయి.
 

click me!