FD interest rates: క‌స్ట‌మ‌ర్ల‌కు గుడ్ న్యూస్ చెప్పిన ఆ బ్యాంక్‌..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 10, 2022, 12:25 PM IST
FD interest rates: క‌స్ట‌మ‌ర్ల‌కు గుడ్ న్యూస్ చెప్పిన ఆ బ్యాంక్‌..!

సారాంశం

 దేశీయ ప్రైవేట్ బ్యాంకుల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న కోటక్ మహీంద్రా బ్యాంకు గుడ్‌న్యూస్ అందిస్తోంది. వినియోగదారులకు వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 

దేశంలోని ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం కోటక్ మహీంద్రా కస్టమర్లను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లు ప్రకటిస్తోంది. ఇప్పుడు మరోసారి వడ్డీరేట్లలో మార్పులు చేసింది. బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీను పెంచుతూ కస్టమర్లకు గుడ్‌న్యూస్ అందించింది. పెంచిన వడ్డీరేట్లు డొమెస్టిక్, ఎన్ఆర్ఓ, ఎన్ఆర్ఈ వినియోగదారులకు వర్తించనుందని తెలిపింది. 

2022 మార్చి 9 నుంచే సవరించిన కొత్త వడ్డీ రేట్లు అమలులోకి వస్తాయని కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది. 2 కోట్ల వరకూ బ్యాలెన్స్ కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్ ఎక్కౌంట్లకు  కొత్త వడ్డీరేట్లు వర్తించనున్నాయి. ఫలితంగా 365 నుంచి 389 రోజుల మెచ్యూరిటీ ఉన్న ఎఫ్‌డీఐలపై వడ్డీ రేటు 5 శాతం పెరిగింది. గతంలో ఈ వడ్డీరేటు 4.9 శాతంగా ఉంది. సీనియర్ సిటిజన్ల కోసం 50 బేసిస్ పాయింట్లను అందిస్తుంది. దేశంలోని అన్ని బ్యాంకులు ఫిక్స్‌‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతున్నాయి. గత నెలలో ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్ , ఐడీబీఐ బ్యాంకులు వడ్డీరేట్లను పెంచాయి.

కోటక్ మహీంద్రా బ్యాంక్ వడ్డీ రేట్ల సవరణ నేపథ్యంలో 365 నుంచి 389 రోజుల మెచ్యూరిటీ కలిగిన ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు 5 శాతానికి పెరిగింది. ఇది వరకు ఈ ఎఫ్‌డీలపై 4.9 శాతం వడ్డీ రేటు లభించేది. అలాగే కోటక్ మహీంద్రా బ్యాంక్ 7 రోజుల నుంచి 30 రోజుల టెన్యూర్‌లోని ఎఫ్‌డీలపై 2.5 శాతం, 31 నుంచి 90 రోజుల ఎఫ్‌డీలపై 2.75 శాతం, 91 నుంచి 120 రోజుల ఎఫ్‌డీలపై 3 శాతం వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది.

7 రోజుల నుంచి 10 ఏళ్ల వరకు టెన్యూర్‌తో కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎఫ్‌డీ సేవలు అందిస్తోంది. ఈ ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 2.5 శాతం నుంచి 5.8 శాతం వరకు ఉంటుంది. 181 రోజుల నుంచి 363 రోజుల ఎఫ్‌డీలపై 4.4 శాతం వడ్డీ పొందొచ్చు. 364 రోజుల ఎఫ్‌డీలపై 4.5 శాతం వడ్డీ సొంతం చేసుకోవచ్చు. 390 రోజుల నుంచి 23 ఏళ్లలోపు ఎఫ్‌డీలపై 5.1 శాతం వడ్డీని పొందొచ్చు.

ఇంకా 3 నుంచి 5 ఏళ్లలోపు ఎఫ్‌డీలపై 5.45 శాతం వరకు వడ్డీ వస్తోంది. అలాగే 5 ఏళ్లు, ఆపైన ఎఫ్‌డీలపై 5.5 శాతం వరకు వడ్డీ రేటును సొంతం చేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్‌కు 50 బేసిస్ పాయింట్ల మేర అదనపు వడ్డీ రేటు లభిస్తుంది. కాగా గత నెలలో ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ వంటి ఇతర బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన విషయం తెలిసిందే. తాజాగా యాక్సిస్ బ్యాంక్ కూడా వడ్డీ రేట్లు పెంచేసింది. మార్చి 5 నుంచి కొత్త వడ్డీ రేట్లు అమలులోకి వచ్చాయి.

PREV
click me!

Recommended Stories

Salary Hike 2026: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది జీతాలు ఎంత పెరుగుతాయంటే?
Highest Paid CEOs : 2025లో అత్యధిక జీతం అందుకున్న టెక్ సీఈవోలు వీళ్లే..!