మరో ఆరు నెలల తర్వాతే కొత్త ఉద్యోగాల జోరు!

Ashok Kumar   | Asianet News
Published : Jul 09, 2020, 02:33 PM ISTUpdated : Jul 09, 2020, 10:21 PM IST
మరో ఆరు నెలల తర్వాతే కొత్త ఉద్యోగాల జోరు!

సారాంశం

మరోవైపు క్యాంపస్‌ నియామకాలు కొంతమేర తగ్గే అవకాశాలున్నాయని వెల్లడైంది. ఈ ఏడాది క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌కు వెళ్లే ఆలోచనలేదని 27 శాతం కంపెనీలు పేర్కొనగా, 39 శాతం కంపెనీలు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపాయి. 

కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఉద్యోగాల నియమకాలకు ఏర్పడిన అంతరాయం జనవరి నాటికి తిరిగి ఊపందుకుంటుందని  రిక్రూట్‌మెంట్‌ సంస్థ కెరీర్‌నెట్‌ కన్సల్టింగ్‌ సంస్థ పేర్కొంది. మరోవైపు క్యాంపస్‌ నియామకాలు కొంతమేర తగ్గే అవకాశాలున్నాయని వెల్లడైంది.

ఈ ఏడాది క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌కు వెళ్లే ఆలోచనలేదని 27 శాతం కంపెనీలు పేర్కొనగా, 39 శాతం కంపెనీలు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపాయి. చాలా కంపెనీలు ఉద్యోగాల భర్తీని ప్రారంభించాయి, అయితే పూర్తిగా నియమకాల ప్రక్రియ జరగడానికి కనీసం మరో ఆరు నెలలు సమయం పడుతుంది.  

నియామకాలను  ఆపేసిన కంపెనీలు కూడా తిరిగి బౌన్స్ అయ్యే అవకాశం ఉంది, వాటిలో 43% వరకు కంపెనీలు ఆరు నెలల్లో చురుకుగా నియామకాలకు వెళతామని సూచిస్తున్నాయి. మరో వైపు క్యాంపస్ నియామకలపై  కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా అధికంగా ప్రభావితం చేస్తుంది, అయితే 27% కంపెనీలు ఈ సంవత్సరం క్యాంపస్‌ రిక్రూట్మెంట్లు నిర్వహించాలని అనుకోవట్లేదు.

also read విజయ్‌మాల్యాను వదలని ఇండియన్ బ్యాంకులు..ఆయనను దివాలాకోరుగా ప్రకటించాల్సిందే.. ...

"ఈ సంవత్సరం, క్యాంపస్ నియామకాలు ఇప్పటికే వాయిదా పడ్డాయి. ఇది మరింత దశలవారీగా ఉంటుందని మేము కూడా ఆశిస్తున్నాము. ఆర్థిక పునరుద్ధరణ ప్రారంభమైనప్పుడు, సంస్థలు తమ ప్రణాళికలను తిరిగి ప్రారంభిస్తాయి ”అని దాస్ చెప్పారు.

నలుగురిలో ముగ్గురు యజమానులు ఎక్కువగా ఐటి సర్వీసు ప్రొవైడర్స్ నేతృత్వంలోని ఆఫర్లను, ఆన్‌బోర్డింగ్ ఉద్యోగులను గౌరవిస్తున్నారని ఒక నివేదిక తెలిపింది. ఇన్ఫోసిస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ రావు ఏప్రిల్‌లో విశ్లేషకులతో మాట్లాడుతూ, రాబోయే సంవత్సరంలో కంపెనీ అన్ని ప్రాంతాలలో నియామకాలు నెమ్మదిగా సాగుతుందని చెప్పారు. క్రాస్ టౌన్ ప్రత్యర్థి విప్రో కూడా ఇలాంటి నియామక ప్రణాళికలను అంచనా వేసింది.

PREV
click me!

Recommended Stories

Gold : బంగారం పై అమెరికా దెబ్బ.. గోల్డ్, సిల్వర్ ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా?
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !