దీపావళి బంపర్ ఆఫర్ ప్రకటించిన జెట్ ఎయిర్ వేస్

Published : Nov 01, 2018, 10:43 AM IST
దీపావళి బంపర్ ఆఫర్ ప్రకటించిన జెట్ ఎయిర్ వేస్

సారాంశం

హ్యాపీ దీపావళి సేల్ పేరిట ఈ ఆఫర్ ప్రకటించగా.. ఎకానమీ, ప్రీమియర్, ఇంటర్నేషనల్ టికెట్లకు ఈ తగ్గింపు వర్తిస్తుందని జెట్ ఎయిర్ వేస్ తెలిపింది. 

ప్రముఖ విమానయాన సంస్థ జెట్ ఎయిర్ వేస్.. బంపర్ ఆఫర్ ప్రకటించింది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని విమాన టికెట్ల పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. 30శాతం డిస్కౌంట్ తో దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో  విమాన టికెట్లను అందించనున్నట్లు జెట్ ఎయిర్ వేస్ ప్రకటించింది.

అయితే.. ఈ పండగ ఆఫర్ కొద్ది రోజులకు మాత్రమే వర్తిస్తుంది. అక్టోబర్ 30వ తేదీ నుంచి నవంబర్ 5వ తేదీ వరకు ఈ ఆఫర్ కింద టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది. హ్యాపీ దీపావళి సేల్ పేరిట ఈ ఆఫర్ ప్రకటించగా.. ఎకానమీ, ప్రీమియర్, ఇంటర్నేషనల్ టికెట్లకు ఈ తగ్గింపు వర్తిస్తుందని జెట్ ఎయిర్ వేస్ తెలిపింది. 

ఈ విమాన టికెట్లను జెట్ ఎయిర్ వేస్ వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా బుక్ చేసుకనే అవకాశం ఉంది. వీటి ద్వారా టికెట్ బుక్ చేసుకున్నవారికి అదనపు సౌకర్యాలు కూడా ఉన్నాయి. టికెట్ బుక్ చేసుకొని ఏదైనా కారణంతో వాటిని క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే... 24గంటలలోపు ఎలాంటి కటింగ్స్ లేకుండానే టికెట్స్ క్యాన్సిల్ చసుకోవచ్చని కూడా జెట్ ఎయిర్ వేస్ తెలిపింది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ దీపావళి మరింత ఆనందంగా జరుపుకోండి. 

PREV
click me!

Recommended Stories

Home Loan: ఇల్లు కొంటున్నారా? తక్కువ వడ్డీతో హోమ్ లోన్ ఇచ్చే బ్యాంకులు ఇవిగో
Personal Loan: శాలరీ స్లిప్ లేకుండా వెంటనే పర్సనల్ లోన్.. ఈ పత్రాలతో గంటల్లో అప్రూవల్ !