ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ లిస్టులో ఉన్న ముఖేష్ అంబానీ ప్రస్తుతం ఉన్న ప్లేస్ నుంచి ఒక స్థానం కిందికి దిగారు. మరి ఆయన్ను ఎవరు కిందికి నెట్టి ఆ స్థానాన్ని ఆక్రమించారు. వరల్డ్ టాప్ రిచ్చస్ట్ పీపుల్ లిస్ట్‌లో ప్రస్తుతం ఆయన ఏ ప్లేస్‌లో ఉన్నారు. అంబానీ ప్రస్తుత ఆస్తి ఎంత తదితర వివరాలు తెలుసుకుందాం. రండి..
రిలయన్స్, జియో వంటి ప్రఖ్యాత ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ గురించి తెలియని వారు ఉండరు. ఆయన ఆసియాలోనే అత్యంత ధనవంతుడు. ఇక భారత దేశంలో చెప్పనక్కర లేదు. దేశంలోనే అత్యధికంగా ప్రభుత్వానికి పన్నులు కడుతున్న వ్యక్తి ముఖేష్ అంబానీ. అందువల్ల ఆయనెంత ధనవంతుడో మనమే అర్థం చేసుకోవచ్చు.
12వ స్థానం నుంచి 11వ ప్లేస్‌కు ముఖేష్ అంబానీ..
ప్రపంచ అత్యంత సంపన్నుల జాబితాలో ఆయన 11వ స్థానంలో ఉండేవారు. ప్రస్తుతానికి 12వ ప్లేస్‌కు ఆయన పడిపోయారు. ఆయన్ను జాబితాలో వెనక్కు నెట్టింది ప్రముఖ అమెరికన్ ఏఐ చిప్ మేకర్ ఎన్వీడియా వ్యవస్థాపకుడు, సీఈవో జెన్సన్ హువాంగ్ . దీంతో అంబానీ 12వ స్థానానికి పడిపోయారు.
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ నివేదిక ప్రకారం ముఖేష్ అంబానీ, హువాంగ్ నికర ఆదాయం విలువ $113 బిలియన్లు. అయితే హువాంగ్ కొన్ని డాలర్లు మాత్రమే ముందంజలో ఉన్నాడు. గత శుక్రవారం మార్కెట్ ముగింపు సమయానికి హువాంగ్ నికర ఆదాయం విలువ $4.73 బిలియన్లకు పెరిగింది. ఈ ఏడాది ఎన్వీడియా షేర్లు భారీగా పెరిగాయి. దీంతో ఈ ఏడాది అత్యధికంగా ఆర్జించిన బిలియనీర్‌గా హువాంగ్ నిలిచారు. ఈ ఏడాది అతని నికర ఆదాయం విలువ 69.3 బిలియన్ డాలర్లు పెరిగింది. ముఖేష్ అంబానీకి మాత్రం $12.1 మిలియన్లు మాత్రమే పెరిగాయి.
ప్రపంచంలోని 10 మంది ధనవంతుల జాబితా ఇదిగో.. స్టాక్ మార్కెట్ ఒడిదొడుకుల వల్ల వీరే ఈ జాబితాలో స్థానాలు మారుతూ ఉంటారు. కాని ఎక్కువ శాతం వీరే ఈ జాబితాలో ఉంటారు. ముఖేష్ అంబానీ, అదానీలు టాప్ 10 లిస్టులోకి వచ్చి వెళుతుంటారు.
1. ఎలోన్ మస్క్ - $244 బిలియన్లు
2. బెర్నార్డ్ ఆర్నాల్ట్ - $201 బిలియన్లు
3. జెఫ్ బెజోస్ - $200 బిలియన్లు
4. మార్క్ జుకర్‌బర్గ్ - $188 బిలియన్లు
5. బిల్ గేట్స్ - $159 బిలియన్లు
6. లారీ ఎల్లిసన్ - $154 బిలియన్లు
7. లారీ పేజ్ - $149 బిలియన్లు
8. స్టీవ్ బాల్మెర్ - $145 బిలియన్లు
9 వారెన్ బఫెట్ - $143 బిలియన్లు
10. సెర్గీ బ్రిన్ - $141 బిలియన్లు
గౌతమ్ అదానీ 104 బిలియన్ డాలర్లతో ఈ జాబితాలో 15వ స్థానంలో ఉన్నారు.