Jeevan Akshay VII: జీవన్ అక్షయ్, న్యూజీవన్ శాంతి ప్లాన్ల‌లో మార్పులు

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 03, 2022, 03:12 PM ISTUpdated : Feb 03, 2022, 03:20 PM IST
Jeevan Akshay VII: జీవన్ అక్షయ్, న్యూజీవన్ శాంతి ప్లాన్ల‌లో మార్పులు

సారాంశం

లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(LIC) జీవన్ అక్షయ్ VII, న్యూ జీవన్ శాంతి పాలసీలపైన యాన్యుటీ రేట్లను పెంచింది. ఈ సవరించిన రేట్లు 2022 ఫిబ్రవరి 1వ తేదీ నుండి అమల్లోకి వస్తాయని బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.

లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(LIC) జీవన్ అక్షయ్ VII, న్యూ జీవన్ శాంతి పాలసీలపైన యాన్యుటీ రేట్లను పెంచింది. ఈ సవరించిన రేట్లు 2022 ఫిబ్రవరి 1వ తేదీ నుండి అమల్లోకి వస్తాయని బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. న్యూజీన్ శాంతి రెండు యాన్యుటీ ఆప్షన్లకు సంబంధించిన కొత్త యాన్యుటీ మొత్తాన్ని ఎల్ఐసీ వెబ్ సైట్‌లో, వివిధ ఎల్ఐసీ యాప్స్‌లోని కాలిక్యులేటర్‌లో లెక్కించుకోవచ్చునని సూచించింది.

జీవన్ అక్షయ్ VII కొత్త యాన్యుటీ రేట్లు కొత్తగా ప్రారంభించిన డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కామన్ పబ్లిక్ సర్వీస్ సెంటర్లు, ప్రస్తుతం ఉన్న ఇతర డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్‌లో లభిస్తాయని, ఈ ప్లాన్స్‌ను ఆయా ఛానల్స్‌లో కొనుగోలు చేయవచ్చునని తెలిపింది. ఈ ప్లాన్స్ ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్.. రెండింటిలో అందుబాటులో ఉంటాయి.

ఎల్ఐసీ పాలసీ హోల్డర్లు జీవన్ అక్షయ్ VII పాలసీ నుండి పది అందుబాటులోని ఆప్షన్స్ నుండి ఎంచుకోవచ్చు. ఇది తక్షణ యాన్యుటీ ప్లాన్. ఏకమొత్తంలో చెల్లింపుపై ఆప్షన్స్ ఎంచుకోవచ్చు. యాన్యుటీ రేట్లు పాలసీ ప్రారంభంలో హామీ ఇవ్వబడతాయి. ఇక ఎల్ఐసీ న్యూజీవన్ శాంతి పాలసీ సింగిల్ లైఫ్, జాయింట్ లైఫ్ డిఫర్డ్ యాన్యుటీలో ఎంచుకోవచ్చు.

PREV
click me!

Recommended Stories

Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !
Post office: రిటైర్మైంట్ త‌ర్వాత బిందాస్‌గా బ‌త‌కొచ్చు.. నెల‌కు రూ. 10 వేలు వ‌చ్చే బెస్ట్ స్కీమ్